బాటిల్ కాస్ట్లీది మందు చీప్ ది..అడ్డంగా దొరికిపోయిన బార్ నిర్వాహకులు

by Ajay Maddhiboyina |

అధిక ధ‌ర‌లు క‌లిగిన మ‌ద్యం బాటిళ్ల‌లో కొంద‌రు కేటుగాళ్లు త‌క్కువ ధ‌ర మ‌ద్యం క‌లిపి మోసానికి పాల్ప‌డుతున్నారు.

బాటిల్ కాస్ట్లీది మందు చీప్ ది..అడ్డంగా దొరికిపోయిన బార్ నిర్వాహకులు
X

దిశ, వెబ్ డెస్క్: అధిక ధ‌ర‌లు క‌లిగిన మ‌ద్యం బాటిళ్ల‌లో కొంద‌రు కేటుగాళ్లు త‌క్కువ ధ‌ర మ‌ద్యం క‌లిపి మోసానికి పాల్ప‌డుతున్నారు. త‌క్కువ ధ‌ర మద్యంతో పాటూ నీళ్ల‌ను సైతం క‌లుపుతున్నారు. తాజాగా ఓ బార్ నిర్వాహ‌కులు మ‌ద్యం క‌ల్తీ చేస్తుండ‌టంతో ఎక్సైజ్ అధికారులు రెడ్ హ్యాండెడ్ గా ప‌ట్టుకున్నారు. లింగంప‌ల్లి ప్రొహిబిష‌న్ అండ్ ఎక్సైజ్ స్టేష‌న్ ప‌రిధిలోని అయ్య‌ప్ప సొసైటీ ప్రాంతంలో ట్రూప్స్ బార్ రెన్యువ‌ల్ చేయ‌లేదు. దీంతో ఫీజు కూడా చెల్లించ‌లేద‌ని ఎక్సైజ్ అధికారులు దాడు చేశారు.

అక్క‌డ ఖ‌రీదైన మ‌ద్యం బాటిళ్ల సీల్ తీసి త‌క్కువ ధ‌ర మ‌ద్యాన్ని అందులో క‌లుపుతున్న‌ట్టు గుర్తించారు. రూ.2690 ధ‌ర ఉన్న ఓ మ‌ద్యం బ్రాండ్ బాటిల్ లో రూ.1000 ధ‌ర ఉండే మ‌ద్యాన్ని క‌లిపుతున్న‌ట్టు రెడ్ హ్యాండెడ్ గా ప‌ట్టుకున్నారు. అనంత‌రం బార్‌లో తనిఖీలు నిర్వహించి 75 కల్తీ బాటిళ్లను, 55 ఖాళీ బాటిళ్లను స్వాధీనం చేసుకున్నారు. బార్ లైసెన్స్ స్వాధీనం చేసుకుని నిర్వాహకులను అదుపులోకి తీసుకున్నారు.

Next Story