VIDEO: హైదరాబాదోళ్లు ఇలా ఉన్నారేంట్రా... ఈవీ ఛార్జింగ్ పాయింట్ వద్ద ఛార్జర్లు మాయం

by Ajay Maddhiboyina |

హైదరాబాద్‌లోని ఈవీ ఛార్జింగ్ స్టేషన్ ల వద్ద ఛార్జర్లు కనిపించడంలేదు. దీనికి ఓ నెటిజన్ వీడియో తీసి సోషల్ మీడియాలో షేర్ చేయగా నెట్టింట తెగ వైరల్ అవుతోంది. కారులో వచ్చిన ఓ వ్యక్తి ఛార్జింగ్ అయిపోవడంతో ఓ ఛార్జింగ్ స్టేషన్ వద్ద రీఛార్జ్ చేసుకునేందుకు ఆగాడు. కానీ ఛార్జర్ కనిపించకపోవడంతో ఆశ్చర్యపోయాడు.

VIDEO: హైదరాబాదోళ్లు ఇలా ఉన్నారేంట్రా... ఈవీ ఛార్జింగ్ పాయింట్ వద్ద ఛార్జర్లు మాయం
X

దిశ‌, వెబ్ డెస్క్: హైదరాబాద్‌లోని ఈవీ ఛార్జింగ్ స్టేషన్ ల వద్ద ఛార్జర్లు కనిపించడంలేదు. దీనికి ఓ నెటిజన్ వీడియో తీసి సోషల్ మీడియాలో షేర్ చేయగా నెట్టింట తెగ వైరల్ అవుతోంది. కారులో వచ్చిన ఓ వ్యక్తి ఛార్జింగ్ అయిపోవడంతో ఓ ఛార్జింగ్ స్టేషన్ వద్ద రీఛార్జ్ చేసుకునేందుకు ఆగాడు. కానీ ఛార్జర్ కనిపించకపోవడంతో ఆశ్చర్యపోయాడు. హైదరాబాద్ వాళ్లు ఇంత దారుణంగా ఉన్నారేంటి.. ఇక్కడ ఛార్జర్ ఏమైంది అంటూ ఆశ్చర్యపోయాడు.

జీహెచ్ఎంసీ వాళ్లు సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని సూచించాడు. తరవాత అక్కడ నుండి మరో ఛార్జింగ్ స్టేషన్ కు వెళ్లగా అక్కడ కూడా అలాంటి పరిస్థితే ఎదురైంది. స్టేషన్ ఉన్నా ఛార్జర్ మాత్రం కనిపించలేదు. దీంతో మరోసారి అవాక్కైన వాహనదారుడు జీహెచ్ఎంసీ అధికారులు ఈవీ స్టేషన్లపై దృష్టి పెట్టాల‌ని కోరాడు. వీడియో నెట్టింట వైరల్ అవ్వ‌డంతో జీహెచ్ ఎంసీ అధికారుల ప‌నితీరుపై నెటిజ‌న్లు మండిప‌డుతున్నారు. VIDEO

Next Story