- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Minister Konda Surekha : మంత్రి కొండా సురేఖ సభలో గందరగోళం
దుబ్బాక నియోజకవర్గం చేగుంట మండలం వడియారం గ్రామంలో రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ(Minister Konda Surekha), స్థానిక బీఆర్ఎస్ ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి(BRS MLA Kotha Prabhakar Reddy) పాల్గొన్న కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కుల పంపిణీ కార్యక్రమం ఉద్రిక్తతల మధ్య రసాభాస(Bustle)గా సాగింది.

దిశ, వెబ్ డెస్క్ : దుబ్బాక నియోజకవర్గం చేగుంట మండలం వడియారం గ్రామంలో రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ(Minister Konda Surekha), స్థానిక బీఆర్ఎస్ ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి(BRS MLA Kotha Prabhakar Reddy) పాల్గొన్న కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కుల పంపిణీ కార్యక్రమం ఉద్రిక్తతల మధ్య రసాభాస(Bustle)గా సాగింది. సభా వేదికపైకి ఓడిపోయిన అభ్యర్థిని అధికారులు పిలవడంతో ఆగ్రహించిన ప్రభాకర్ రెడ్డి ప్రోటోకాల్(Protocol)పాటించకుండా చిల్లర రాజకీయాలు మానుకోవాలని డిమాండ్ చేశారు.
కాంగ్రెస్ అభ్యర్థి చెరుకు శ్రీనివాస్ రెడ్డిని వేదికపైకి ఆహ్వానించడం పట్ల ప్రభాకర్ రెడ్డి మండిపడ్డారు. ఏ హోదాతో శ్రీనివాస్ రెడ్డిని వేదికపై కూర్చోబెడుతారని మంత్రి కొండా సురేఖను ప్రశ్నించాడు. మంత్రి సూచనతో శ్రీనివాస్ రెడ్డి వేదికపై వెనక వరుసలో కూర్చున్నారు. చిల్లర రాజకీయాలు మానుకోవాలని, ప్రోటోకాల్ పాటించాలని ప్రభాకర్ రెడ్డి వ్యాఖ్యానించారు. దీంతో సభా ప్రాంగణంలో ఉన్న కాంగ్రెస్, బీఆర్ఎస్ కార్యకర్తలు పోటాపోటీ నినాదాలతో రెచ్చిపోయారు. రెండు పార్టీల కార్యకర్తలు పరస్పరం బాహాబాహీకి, తోపులాటకు దిగారు. వారి మధ్య గొడవ కారణంగా సభా కార్యక్రమం రసభాసగా మారిపోయింది. మంత్రి కొండా సురేఖ సర్ధిచెప్పే ప్రయత్నం చేసినప్పటికి రెండు వర్గాలు గొడవ ఆపలేదు. పోలీసులు జోక్యం చేసుకుని ఇరువర్గాలను అదుపు చేశారు.






