- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
చౌటుప్పల్ మున్సిపాలిటీలో హోరాహోరీ.. హంగ్ దిశగా ఫలితాలు?
మునుగోడు నియోజకవర్గంలోని కీలకమైన చౌటుప్పల్ మున్సిపాలిటీలో ఎన్నికల ఫలితాలు ఉత్కంఠ రేపుతున్నాయి. మొదటి ఆరు వార్డుల ఫలితాల్లో కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలు చెరో రెండు స్థానాలు గెలుచుకోవడంతో ఎవరికీ స్పష్టమైన మెజారిటీ లభించలేదు. దీంతో మున్సిపాలిటీ ఫలితాలు హంగ్ దిశగా సాగుతుండటంతో అభ్యర్థులు, ఓటర్లలో తీవ్ర ఆసక్తి నెలకొంది.

X
దిశ, వెబ్‌డెస్క్: మునుగోడు నియోజకవర్గంలో అతి ముఖ్యమైన చౌటుప్పల్ మున్సిపాలిటీలో ఎన్నికల ఫలితాలు అన్ని పార్టీలకు షాకిస్తున్నాయి. తాజాగా విడుదలైన మొత్తం ఆరు స్థానాల్లో అన్ని పార్టీలు రెండు స్థానాల్లో విజయం సాధించాయి. 1వ వార్డులో కాంగ్రెస్ అభ్యర్థి కొసనం రాకేష్ రెడ్డి, 2వ వార్డులో బీజేపీ అభ్యర్థి పోలేపల్లి లక్ష్మి, 3వ వార్డులో కాంగ్రెస్ అభ్యర్థి పల్లె లావణ్య, 4వ వార్డులో బీఆర్ఎస్ క్యాండిడేట్ ఊదరి యాదయ్య, 5వ వార్డులో బీఆర్ఎస్ అభ్యర్థి కొయ్యడ శేఖర్, 6వ వార్డులో బీజేపీ అభ్యర్థి ఆలే శ్రీలత చిరంజీవి విజయం సాధించారు. దీంతో ఇప్పటి వరకు స్పష్టమైన మెజారిటీ మాత్రం లభించలేదు. ఇక ముందు రాబోయే వార్డుల ఫలితాల కోసం అభ్యర్థులు, చౌటుప్పల్ మున్సిపాలిటీ ప్రజలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
Next Story






