పేరు మార్చినా ప్రయోజనం లేదు.. BRSకు ప్రజలు VRS ఇచ్చేశారు: మెట్టు సాయికుమార్

by Ramesh Naini |

బీఆర్ఎస్‌ను టీఆర్ఎస్‌గా మార్చినా చేసేదేమీ లేదని, బీఆర్ఎస్ అయినా, టీఆర్ఎస్ అయినా తెలంగాణ ప్రజలు వాళ్ళకి వీఆర్ఎస్ ఇచ్చేశారని రాష్ట్ర ఫిషరీస్ ​కార్పొరేషన్ చైర్మన్, మెట్టు సాయి కుమార్ విమర్శించారు.

పేరు మార్చినా ప్రయోజనం లేదు.. BRSకు ప్రజలు VRS ఇచ్చేశారు: మెట్టు సాయికుమార్
X

దిశ, తెలంగాణ బ్యూరో: బీఆర్ఎస్‌ను టీఆర్ఎస్‌గా మార్చినా చేసేదేమీ లేదని, బీఆర్ఎస్ అయినా, టీఆర్ఎస్ అయినా తెలంగాణ ప్రజలు వాళ్ళకి వీఆర్ఎస్ ఇచ్చేశారని రాష్ట్ర ఫిషరీస్ ​కార్పొరేషన్ చైర్మన్, మెట్టు సాయి కుమార్ విమర్శించారు. సోమవారం ఆయన గాంధీభవన్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. కల్వకుంట్ల కుటుంబం అంటేనే కుట్రల కుటుంబమని, పదేండ్లు తెలంగాణ అమరులను, ప్రజాసంఘాలను, ఉద్యోగ సంఘాలను గోస పెట్టారని ఆయన మండిపడ్డారు. కొంగ జపం చేస్తున్న కేటీఆర్ వారి పదేండ్ల కాలంలో ప్రజలనే కాదు, సొంత పార్టీ నేతలను పట్టించుకోలేదని, పాదయాత్ర కాదు పొర్లు దండాల యాత్ర చేసినా కూడా కేటీఆర్‌ను ఎవరూ పట్టించుకోరని మెట్టు సాయి కుమార్ విమర్శించారు. కేటీఆర్‌ను తెలంగాణ ప్రజలు నమ్మే పరిస్థితులు లేవని ఆయన అన్నారు.

Next Story