విద్యుత్ బస్సుల విధానంలో మార్పులు చేయాలి: AIRTWF

by Naga Rani Yarlagadda |

దేశంలోని 56 ఆర్టీసీలను ప్రైవేట్ పెట్టుబడిదారులకు అప్పగించాలనే ధోరణితో విద్యుత్ బస్సులను ప్రవేశపెడుతున్న ప్రభుత్వ విధానంలో..

విద్యుత్ బస్సుల విధానంలో మార్పులు చేయాలి: AIRTWF
X

దిశ, తెలంగాణ బ్యూరో: దేశంలోని 56 ఆర్టీసీలను ప్రైవేట్ పెట్టుబడిదారులకు అప్పగించాలనే ధోరణితో విద్యుత్ బస్సులను ప్రవేశపెడుతున్న ప్రభుత్వ విధానంలో మార్పులు చేయాలని, విద్యుత్ బస్సుల కొనుగోలు- నిర్వహణ- ఆపరేషన్ బాధ్యతలను ప్రభుత్వ ఆర్టీసీలకే అప్పగించాలని ఆల్ ఇండియా రోడ్ ట్రాన్స్పోర్ట్ వర్కర్స్ ఫెడరేషన్ (ఏఐఆర్టీడబ్ల్యూఎఫ్) డిమాండ్ చేసింది. చెన్నైలో ఆదివారం జరిగిన సదస్సులో సీఐటీయూ అఖిల భారత ఉపాధ్యక్షులు సౌందర్ రాజన్ మాట్లాడుతూ ఆర్టీసీలను, కార్మికులు, ప్రజలను రక్షించేందుకు ఐక్యంగా పోరాటం అవసరమని తెలిపారు. సదస్సుకు ఏఐఆర్టీడబ్ల్యూఎఫ్ జాతీయ అధ్యక్షులు ఆర్. కరుమలయన్ అధ్యక్షత వహించారు. విధాన ముసాయిదాను అరుముగ్ నాయనార్ ప్రవేశపెట్టగా, వేర్వేరు రాష్ట్రాల అనుభవాలు, నీతి అయోగ్ పత్రంపై జాతీయ కార్యదర్శి వి.ఎస్.రావు వివరించారు. తొమ్మిది రాష్ట్రాల 19 ఆర్టీసీల నుండి 100 మంది ప్రతినిధులు పాల్గొని ప్రతి ఆయా కార్పొరేషన్లలోని పరిస్థితులను వివరించారు. ఆమోదించిన కార్యాచరణలో ప్రధానమంత్రి, ముఖ్యమంత్రులకు వినతిపత్రాల సమర్పణ, ట్రాన్స్‌పోర్ట్ కార్యాలయాల వద్ద ధర్నాలు, ప్రజా సంతకాల సేకరణ, ఫిబ్రవరి 2026లో గవర్నర్లకు వినతిపత్రాల సమర్పణ ఉన్నాయి. టీజీఎస్‌ఆర్టీసీ తరఫున ఎస్.డబ్ల్యూ.ఎఫ్ కు చెందిన తొమ్మిది మంది ప్రతినిధులు పాల్గొన్నారు.

Next Story