రేవంత్ ప్రజాసేవను విజయవంతంగా కొనసాగించాలి: చంద్రబాబు

by Disha Web Desk 2 |
రేవంత్ ప్రజాసేవను విజయవంతంగా కొనసాగించాలి: చంద్రబాబు
X

దిశ, డైనమిక్ బ్యూరో: తెలంగాణ ముఖ్యమంత్రిగా ఇవాళ రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేశారు. ఈ నేపథ్యంలో ఆయనకు ప్రముఖులు అభినందనలు తెలుపుతున్నారు. ఈ క్రమంలోనే టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఆసక్తికర ట్వీట్ చేశారు. తెలంగాణ ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన రేవంత్‌రెడ్డికి శుభాకాంక్షలు అని పేర్కొన్నారు. రేవంత్ తన ప్రజాసేవను విజయవంతంగా కొనసాగించాలని కోరుకున్నారు. మరోవైపు నటుడు చిరంజీవి కూడా రేవంత్ రెడ్డికి శుభాకాంక్షలు తెలిపారు. ‘మీ నాయకత్వంలో రాష్ట్రం అభివృద్ధి సాధించాలి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కకు, మంత్రులకు హృదయపూర్వక శుభాకాంక్షలు’ అంటూ ట్వీట్ చేశారు.

Next Story

Most Viewed