- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
తెలంగాణ ఎన్నికలు.. జగన్ పై చంద్రబాబు గెలుపు
by Muthe.Rajitha |
తెలంగాణ పంచాయతీ ఎన్నికల మూడో విడతలో ఓ ఆసక్తి పరిణామం చోటు చేసుకుంది.

X
దిశ, వెబ్ డెస్క్ : తెలంగాణ పంచాయతీ ఎన్నికల మూడో విడతలో ఓ ఆసక్తి పరిణామం చోటు చేసుకుంది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు మండలం గుండ్లరేవు గ్రామంలో ఈ ఘటన జరిగింది. సర్పంచి ఎన్నికల్లో భూక్యా చంద్రబాబు, బానోత్ జగన్నాథం అలియాస్ జగన్ ఇద్దరూ కాంగ్రెస్‌లోని వేర్వేరు వర్గాల మద్దతుతో పోటీ పడ్డారు. అయితే వారి పేర్ల వల్ల ఇద్దరూ సోషల్ మీడియాలో వైరల్ గా మారారు. అంతేకాదు ఇవాళ జరిగిన పోలింగ్‌లో భూక్యా చంద్రబాబు విజయం సాధించడంతో.. "జగన్‌పై చంద్రబాబు విజయం" అంటూ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. కాగా ఇప్పటి వరకు జరిగిన ఓట్ల లెక్కింపులో రాష్ట్రవ్యాప్తంగా కాంగ్రెస్ దూసుకుపోతోంది.
Next Story






