- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
కేసీఆర్ బాటలో టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి!?
టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి చండీయాగం నిర్వహిస్తున్నారు.

X
దిశ, డైనమిక్ బ్యూరో: టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి చండీయాగం నిర్వహిస్తున్నారు.గడిచిన మూడు రోజులుగా కొడంగల్ లోని రేవంత్ రెడ్డి నివాసంలో పండితులు ఈ యాగం కొనసాగిస్తున్నారు. అభ్యర్థుల ఎంపిక, చేరికల విషయంలో ఇన్నాళ్లు ఢిల్లీలో ఉన్న రేవంత్ రెడ్డి శుక్రవారం కుటుంబ సమేతంగా చండీయాగంలో పాల్గొనే అవకాశం ఉంది. ఎన్నికల వేళ దైవానుగ్రహం కోసం పలువురు రాజకీయ నేతలు యాగాలను నిర్వహించడం చూస్తూనే ఉంటాం. గతంలో సీఎం కేసీఆర్ సైతం కీలకమైన సమయాల్లో పలు యాగాలు నిర్వహించారు. గత జూలైలో తాండూరు ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి అతిరుద్ర మహాయాగం నిర్వహించిన సంగతి తెలిసిందే. తాజాగా రేవంత్ రెడ్డి సైతం యాగాన్ని నిర్వహించడం ఆసక్తిగా మారింది.
Next Story






