Chamala: త్వరలో బయటికి కేటీఆర్ స్కాములు.. కాంగ్రెస్ ఎంపీ హాట్ కామెంట్స్

by Ramesh Goud |

కేటీఆర్ నోటికి ఏది వస్తే అదే మాట్లాడుతున్నాడని, ఆయన మెంటల్ ఆసుపత్రికి వెళ్లడం ఖాయం అని భువనగిరి(Bhuvanagiri) కాంగ్రెస్ ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి(Chamala Kiran Kumar Reddy) అన్నారు.

Chamala: త్వరలో బయటికి కేటీఆర్ స్కాములు.. కాంగ్రెస్ ఎంపీ హాట్ కామెంట్స్
X

దిశ, వెబ్ డెస్క్: కేటీఆర్ నోటికి ఏది వస్తే అదే మాట్లాడుతున్నాడని, ఆయన మెంటల్ ఆసుపత్రికి వెళ్లడం ఖాయం అని భువనగిరి(Bhuvanagiri) కాంగ్రెస్ ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి(Chamala Kiran Kumar Reddy) అన్నారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(BRS Working President KTR) వ్యాఖ్యలపై ట్విట్టర్ వేదికగా స్పందించిన చామల.. హాట్ కామెంట్స్ చేశారు. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం(Congress Government) ఆరు గ్యారెంటీలు కాదు కదా.. అర గ్యారెంటీ కూడా చేయలేదని కేటీఆర్ చెబుతున్నారని, 2014 నుంచి 2018 వరకు గుండు సున్నా చేసిన మీరా చెప్పేది అని ఫైర్ అయ్యారు. అలాగే మీ మేనిఫెస్టో్లో 20 శాతం కూడా చేయకుండా నోటికి వచ్చినట్టు మాట్లాడుతుంటే తెలంగాణ ప్రజలు ఏం అనుకుంటారు అనే సోయి కూడా కేటీఆర్ కి లేదని విమర్శించారు. అంతేగాక అధికారం పోయి నిద్ర పట్టక చెప్పిందే చెబుతున్నాడని, ఎన్నిసార్లు చెప్పిన ప్రజలు నమ్మే స్థితిలో లేరని అన్నారు.

ఇక రైతులకు రుణమాఫీ, ఉచిత బస్సు, ఉచిత విద్యుత్, రూ. 500 కే గ్యాస్ సిలిండర్ కేటీఆర్ కు కనిపిస్తలేవా అని మండిపడ్డారు. రైతు భరోసా మీలాగా రాళ్లు, రప్పలకు, రియల్ ఎస్టేట్ భూములకు ఇవ్వమని, సాగు చేస్తున్న రైతులకు మాత్రమే ఇస్తామని స్పష్టం చేశారు. ఇక హెచ్ఎండీఏ(HMDA) పైసలు మీ దోస్తులకు కట్టిబెట్టి దుర్మార్గపు చర్యలకు పాల్పడ్డ మీరా మాట్లాడేది అని, ప్రజా ధనం దుర్వినియోగం చేశారని ఘాటు వ్యాఖ్యలు చేశారు. అలాగే కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలను మోసం చేస్తుందని చెబుతున్నారని, తెలంగాణ ఇచ్చింది యూపీఏ ప్రభుత్వం అనే సోయి కూడా కేటీఆర్ కు లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. అంతేగాక మీ కుటుంబం అంతా పోయి సోనియాగాంధీ కాళ్ళు మొక్కిన ఫోటోలు ఇంకా ఉన్నాయి అనేది మర్చిపోవద్దని చెప్పారు. ప్రజలకు తప్పుడు ప్రచారాలు కాకుండా వాస్తవాలు చెప్పి, మంచి అపోజిషన్ లీడర్ గా పేరు తెచ్చుకోవాలని సలహా ఇచ్చారు. నోరు గుల కాకపోతే ఆరు గ్యారెంటీలను అర గ్యారెంటీలు కూడా ఇవ్వలేదని ఎలా అంటారని, అతి త్వరలో కేటీఆర్ చేసిన మరిన్ని స్కాములు బయటకి వస్తాయని తెలిపారు. కేటీఆర్ చివరికి మెంటల్ హస్పిటల్ కి పోవాల్సి వస్తుంది జాగ్రత్త అని కాంగ్రెస్ ఎంపీ(Congress MP) హెచ్చరించారు.

Next Story