ఆఖరికు భారతీయ రాష్ట్ర సమితిగా మారింది: కాంగ్రెస్ MP

by Gantepaka Srikanth |

ఆఖరికు భారతీయ రాష్ట్ర సమితిగా మారింది: కాంగ్రెస్ ఎంపీ సెటైర్లు

ఆఖరికు భారతీయ రాష్ట్ర సమితిగా మారింది: కాంగ్రెస్ MP
X

దిశ, వెబ్‌డెస్క్: కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్‌(Bandi Sanjay)కి భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి(Chamala Kiran Kumar Reddy) కౌంటర్ ఇచ్చారు. గురువారం చామల మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్రంలో రేవంత్ రెడ్డి, కేటీఆర్ పాలన నడుస్తోందని బండి సంజయ్ చెప్పే ప్రయత్నం చేశారని విమర్శించారు. బీఆర్ఎస్ హయాంలో జరిగిన దోపిడీని బండి సంజయ్, కిషన్ రెడ్డి ఎందుకు అరికట్టలేదని ప్రశ్నించారు. 2014 నుంచి 2023 వరకు బీఆర్ఎస్, బీజేపీ కలిసి రాష్ట్రంలో సంసారం చేశాయి.. ఆఖరుకు బీఆర్ఎస్ భారతీయ రాష్ట్ర సమితిగా మారిందని ఎద్దేవా చేశారు. బీఆర్ఎస్ దోచుకున్న దాంట్లో బీజేపీకి భాగస్వామ్యం ఉందా? అని అనుమానం వ్యక్తం చేశారు. వంద రోజుల తర్వాత గవర్నర్ కేటీఆర్‌పై ప్రాసిక్యూషన్‌కు అనుమతి ఇచ్చారు.. ఫార్ములా ఈ-కార్ రేస్‌లో కేటీఆర్‌పై ఛార్జ్ షీట్ ఫైల్ చేయాలంటే ఏ2గా ఉన్న ఐఏఎస్ అరవింద్ కుమార్‌ను ప్రాసిక్యూషన్ చేయాలని చెప్పారు.

అరవింద్ కుమార్‌పై డీవోపీటీకి రాష్ట్ర ప్రభుత్వం లేఖ రాసింది.. ఇన్నాళ్లూ గవర్నర్ అనుమతి ఇవ్వకుండా బీజేపీ ఒత్తిడి తెచ్చిందని అన్నారు. ఇప్పుడు ఐఏఎస్ అరవింద్ కుమార్‌పై ఛార్జ్ షీట్ దాఖలు చేయకుండా డీవోపీటీలో ఆపే ప్రయత్నం బీజేపీ చేస్తోందని కీలక వ్యాఖ్యలు చేశారు. కేటీఆర్‌కు ఫార్ములా ఈ కార్ రేసులో బీజేపీ మద్దతు ఇస్తోంది.. ఫార్ములా ఈ-కార్ రేస్ లొట్టపీసు కేసు అన్న కేటీఆర్ విచారణకు సహకరించాలని హితవు పలికారు. ఫార్ములా ఈ-కార్ రేస్‌లో వాస్తవాలను ఏసీబీ నిగ్గు తేల్చాలని అన్నారు. బండి సంజయ్ చిల్లర మాటలు బంద్ చేసి ఐఏఎస్ అరవింద్ కుమార్‌పై విచారణ జరిగే విధంగా డీవోపీటీని ఒప్పించాలని సూచిచారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ ఒక్కటే అని బండి సంజయ్ అంటే తెలంగాణ ప్రజకు నమ్మరని చెప్పారు. పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీకి 8 సీట్లు ఏ పార్టీ వాళ్ళ ఓట్లతో వచ్చాయో ప్రజలకు తెలుసని అన్నారు. జూబ్లీహిల్స్ ఉపఎన్నికల్లో బీజేపీ ఓట్లు ఏ పార్టీకి పడ్డాయో కూడా ప్రజలకు తెలుసని వెల్లడించారు. గవర్నర్‌పై ఒత్తిడి రాకుండా బండి సంజయ్ చూడాలని అన్నారు.

Next Story