అన్నా ప్లీజ్ సపోర్ట్ చేయండి.. కోమటిరెడ్డిని కలిసిన చామల

by Disha Web Desk 2 |
అన్నా ప్లీజ్ సపోర్ట్ చేయండి.. కోమటిరెడ్డిని కలిసిన చామల
X

దిశ, తెలంగాణ బ్యూరో: భువనగిరి పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి చామల కిరణ్​ కుమార్ రెడ్డి గురువారం మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డిని ప్రత్యేకంగా కలిశారు. లోక్‌సభ ఎన్నికల్లో తన విజయానికి సహకరించాలని కోరారు. తనకు టిక్కెట్ వచ్చేందుకు చొరవ చూపినందుకు ధన్యవాదాలు తెలిపారు. ఈ సందర్భంగా చామల కిరణ్​ కుమార్ రెడ్డి మాట్లాడుతూ.. కోమటిరెడ్డి ఫ్యామిలీ మద్ధతుతో విజయం సాధిస్తానని ధీమా వ్యక్తం చేశారు. ఉమ్మడి నల్లగొండ జిల్లాలో సుదీర్ఘ రాజకీయ అనుభవం కలిగిన నేతగా కోమటిరెడ్డి ఫ్యామిలీకి ప్రజల్లో ఆదరణ, ప్రాధాన్యత ఉన్నదన్నారు. రాష్ట్రంలో పవర్ పొందినట్లే, దేశంలోనూ కాంగ్రెస్ అధికారంలోకి రాబోతున్నదన్నారు. తనకు టిక్కెట్ వచ్చేందుకు చొరవ చూపిన సీఎం రేవంత్ రెడ్డి, ఏఐసీసీ ఇన్‌చార్జీ దీపాదాస్ మున్షి, ఏఐసీసీ పెద్దలందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నానని చెప్పారు.


Next Story

Most Viewed