ఉపఎన్నిక వ‌స్తే కాంగ్రెస్ దే విజ‌యం: చామ‌ల‌

by Ajay Maddhiboyina |

ఉపఎన్నిక‌లు వ‌స్తే కాంగ్రెస్ పార్టీనే విజ‌యం సాధిస్తుంద‌ని ఎంపీ చామ‌ల కిర‌ణ్ కుమార్ రెడ్డి అన్నారు. స్పీక‌ర్ నిర్ణ‌యానికి కాంగ్రెస్ క‌ట్టుబ‌డి ఉంటుంద‌న్నారు. విప‌క్షాల‌తో తాడో పేడో తేల్చుకుంటామ‌ని స్ప‌ష్టం చేశారు.

ఉపఎన్నిక వ‌స్తే కాంగ్రెస్ దే విజ‌యం: చామ‌ల‌
X

దిశ‌, వెబ్ డెస్క్: ఉపఎన్నిక‌లు వ‌స్తే కాంగ్రెస్ పార్టీనే విజ‌యం సాధిస్తుంద‌ని ఎంపీ చామ‌ల కిర‌ణ్ కుమార్ రెడ్డి అన్నారు. స్పీక‌ర్ నిర్ణ‌యానికి కాంగ్రెస్ క‌ట్టుబ‌డి ఉంటుంద‌న్నారు. విప‌క్షాల‌తో తాడో పేడో తేల్చుకుంటామ‌ని స్ప‌ష్టం చేశారు. సుప్రీకోర్టు ఎమ్మెల్యేల‌పై వేటు వేస్తుంద‌ని బీఆర్ఎస్ నాయ‌కులు అనుకున్నార‌ని, కానీ కోర్టు కూడా స్పీక‌ర్ నే మూడు నెల‌ల‌లోపు నిర్ణ‌యం తీసుకోవాల‌ని ఆదేశించింద‌న్నారు. కాబ‌ట్టి స్పీక‌ర్ నిర్ణ‌యానికే కాంగ్రెస్ పార్టీ క‌ట్టుబ‌డి ఉంటామ‌న్నారు. ప్ర‌జాపాల‌న బ్ర‌హ్మాండంగా ఉంద‌ని, కాబ‌ట్టి క‌చ్చితంగా గెలుస్తామ‌ని చెప్పారు. ఇదిలా ఉంటే పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలకు సంబంధించి స్పీకర్ నిర్ణయం తీసుకోవాలని సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిన సంగతి తెలిసిందే. దీంతో పార్టీ మారిన 10 మంది ఎమ్మెల్యేలపై స్పీకర్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారన్నది ఆసక్తికరంగా మారింది. ఒకవేళ అనర్హత వేటు వేస్తే రాష్ట్రంలో ఉపఎన్నికలు రానున్నాయి.

Next Story