- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
HYD: చాక్నవాడిలో కూలిన పెద్ద నాలా.. కుప్పకూలిన దుకాణాలు
గోషామహల్ చాక్నవాడిలోని ఘోర ప్రమాదం జరిగింది. ఉన్నట్టుండి పెద్ద నాలా కుంగిపోయింది.

X
దిశ, వెబ్‌డెస్క్: హైదరాబాద్‌లోని గోషామహల్ చాక్నవాడిలో ఘోర ప్రమాదం జరిగింది. ఉన్నట్టుండి పెద్ద నాలా కుంగిపోయింది. ఈ నేపథ్యంలో అటుగా వచ్చిన కార్లు, ఆటోలు, బైకులు నాలాలో పడిపోయాయి. అంతేగాక, నాలాపై నిర్మించిన దుకాణాలు కుప్పకూలి, పలువురికి తీవ్ర గాయాలు అయ్యాయి. ప్రమాదాన్ని గమనించిన స్థానిక ప్రజలు భయాందోళనతో ఇళ్ల నుంచి పరుగులు తీశారు. విషయం తెలుసుకున్న పోలీసులు హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. అనంతరం కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. ప్రమాదానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Next Story






