- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Chakali Ilamma: చాకలి ఐలమ్మ యూనివర్సిటీకి రేవంత్ సర్కార్ మరో గుడ్ న్యూస్
చాకలి ఐలమ్మ యూనివర్సిటీకి రాష్ట్ర ప్రభుత్వం తీపి కబురు చెప్పింది.

X
దిశ, తెలంగాణ బ్యూరో/ డైనమిక్ బ్యూరో : వీరనారి చాకలి ఐలమ్మ మహిళా యునివర్సిటీ (chakali Ilamma University) అభివృద్ధిపై దృష్టి సారించిన రాష్ట్ర ప్రభుత్వం ఆ దిశగా మరో కీలక నిర్ణయం తీసుకుంది. తాజాగా వర్సిటీకి రూ.300 కోట్లు కేటాయించింది. ఈ మేరకు నిధులు కేటాయిస్తూ తెలంగాణ విద్యాశాఖ (Education Department) ఉత్తర్వులు జారీ చేసింది. కోఠి ఉమెన్స్ కాలేజ్‌ను (Koti Women's College) యూనివర్సిటీగా మార్చడంతోపాటు దానికి వీరనారి చాకలి ఐలమ్మ మహిళా యునివర్సిటీగా పేరు పెట్టిన సంగతి తెలిసిందే. ఇటీవల అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా యూనివర్సిటీలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి (CM Revanth Reddy) మొత్తం రూ. 550 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు చేశారు.
Next Story






