- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
చైతన్య దివిటీ ప్రొఫెసర్ జయశంకర్.. జయంతి వేళ ఎమ్మెల్సీ కవిత ఘన నివాళి
తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర స్వాప్నికుడు, సిద్ధాంతకర్త ప్రొఫెసర్ ఆచార్య జయశంకర్ (Professor Acharya Jayashankar) 90వ జయంతి నేడు.

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర స్వాప్నికుడు, సిద్ధాంతకర్త ప్రొఫెసర్ ఆచార్య జయశంకర్ (Professor Acharya Jayashankar) 90వ జయంతి నేడు. ఈ సందర్భంగా ఆయన జయంతి వేడుకలను ప్రజలు, మేధావులు, ఉద్యమకారులు రాష్ట్ర వ్యాప్తంగా జరుపుకుంటున్నారు. ఈ నేపథ్యంలోనే ప్రొఫెసర్ జయశంకర్ జయంతి సందర్భంగా తెలంగాణ జాగృతి వ్యవస్థాపకురాలు, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ (MLC Kavitha) కవిత ప్రత్యేక రాష్ట్ర సాధానలో ఆయన చేసిన సేవలను గుర్తు చేసుకుంటూ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ‘X’ (ట్విట్టర్) వేదికగా ట్వీట్ చేశారు.
తెలంగాణకు జరుగుతున్న అన్యాయాలు, అసమానతలను ఎత్తిచూపుతూ, తెలంగాణ ప్రజలలో చైతన్య దివిటీ వెలిగించిన గొప్ప మేధావి ప్రొఫెసర్ జయశంకర్ సార్ అని కొనియాడారు. వలస పాలకుల చెరలో బందీ అయిన తెలంగాణ తల్లి విముక్తి కోసం ఆయన తిరగని ప్రాంతం లేదని అన్నారు. సమస్త వనరుల సిరుల మాగాణమైన తెలంగాణ యాచించే స్థాయి నుంచి శాసించే స్థాయికి రావాలని అనుక్షణం పరితపించారని పేర్కొన్నారు. మలి దశ తెలంగాణ ఉద్యమంలో కేసీఆర్ (KCR) మార్గదర్శిగా.. సమస్త తెలంగాణకు మార్గనిర్దేశకుడిగా ఆయన చేసిన కృషి సదా స్మరణీయమని తెలిపారు. జీవితాంతం ప్రత్యేక రాష్ట్ర సాధనే ఏకైక లక్ష్యంగా పనిచేసిన ప్రొఫెసర్ జయశంకర్ సార్ జయంతి సందర్భంగా ఆ మహనీయుడికి ఘన నివాళులు అంటూ కవిత ట్వీట్ చేశారు.






