అధిక శాతం వడ్డీ చెల్లింపులు కష్టం అవుతోంది! సీఎం రేవంత్‌‌తో పీఎం ఆర్ధిక సలహా మండలి చైర్మన్ భేటీ

by Ramesh Naini |

సమాఖ్య విధానంలో కేంద్రం, రాష్ట్రాలు పరస్పరం గౌరవించు కోవాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు.

అధిక శాతం వడ్డీ చెల్లింపులు కష్టం అవుతోంది! సీఎం రేవంత్‌‌తో పీఎం ఆర్ధిక సలహా మండలి చైర్మన్ భేటీ
X

దిశ, తెలంగాణ బ్యూరో/ డైనమిక్ బ్యూరో: సమాఖ్య విధానంలో కేంద్రం, రాష్ట్రాలు పరస్పరం గౌరవించు కోవాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) అన్నారు. ఈ మేరకు శనివారం సీఎం రేవంత్ రెడ్డి ని జూబ్లీ హిల్స్ నివాసంలో (Prime Minister's Economic Advisory Council) ప్రధానమంత్రి ఆర్థిక సలహా మండలి చైర్మన్ ఎస్ మహేంద్ర దేవ్ (Mahendra Dev) మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. తెలంగాణను అభివృద్ధి పథంలో తీసుకువెళ్లే అంశంపై ఈ సందర్భంగా చర్చలు జరిపారు. రాష్ట్రాలు అభివృద్ధి చెందితేనే దేశం అభివృద్ధి చెందుతుందని రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు.

హైదరాబాద్‌తో పాటు రాష్ట్రంలోని పట్టణ ప్రాంతాల్లో మౌలిక సదుపాయాల కల్పన పై దృష్టి సారించినట్లు తెలిపారు. యువతకు ఉపాధి అవకాశాలు కల్పించడమే ధ్యేయంగా ముందుకు సాగుతున్నామని పేర్కొన్నారు. రాష్ట్రంలో పారిశ్రామిక రంగంతో పాటు సేవల రంగం అభివృద్ధి కోసం ప్రణాళికలు రూపొందిస్తున్నామని అన్నారు. ఉద్యోగులకు సముచితమైన అవకాశాలు కల్పిస్తేనే రాష్ట్రానికి కంపెనీ లు వస్తాయని పేర్కొన్నారు. హైదరాబాద్ చుట్టూ రీజినల్ రింగ్ రోడ్ నిర్మిస్తామని చెప్పారు. రీజినల్ రింగ్ రోడ్‌కు అనుసంధానంగా రేడియల్ రోడ్లు నిర్మిస్తున్నామని చెప్పుకొచ్చారు.

అధిక వడ్డీలకు తీసుకున్న రుణాలపైన సీఎం ఆందోళన వ్యక్తం చేశారు. అధిక శాతం వడ్డీల కారణంగా రాష్ట్రాభివృద్ధి కుంటుపడుతుందని, తిరిగి చెల్లింపులు కష్టం అవుతోందని వివరించారు. వడ్డీలు చెల్లించడం కోసమే రాష్ట్ర ఆదాయం ఖర్చు చేయాల్సి వస్తోందని తెలిపారు. అధిక వడ్డీ రేట్లకు తీసుకున్న రుణాలపైన వడ్డీ తగ్గించుకోవడానికి ప్రయత్నం చేస్తున్నామని తెలిపారు. ఈ సమావేశంలో రాష్ట్ర ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి సందీప్‌కుమార్‌ సుల్తానియా తదితర అధికారులు పాల్గొన్నారు.

Next Story