SLBC: ప్రపంచంలోనే అతిపెద్దది.. ఎస్ఎల్‌బీసీ ఘటనపై విచారణ జరిపించాలి : చాడా

by Ramesh Naini |

శ్రీశైలం లెఫ్ట్ బ్యాంక్ కెనాల్ వద్ద జరిగిన ప్రమాదంలో అనేక పరిణామాలు ఉన్నాయని సీపీఐ జాతీయ కార్యవర్గ సభ్యుడు చాడ వెంకటరెడ్డి అన్నారు.

SLBC: ప్రపంచంలోనే అతిపెద్దది.. ఎస్ఎల్‌బీసీ ఘటనపై విచారణ జరిపించాలి : చాడా
X

దిశ, డైనమిక్ బ్యూరో: శ్రీశైలం లెఫ్ట్ బ్యాంక్ కెనాల్ వద్ద (SLBC) జరిగిన ప్రమాదంలో అనేక పరిణామాలు ఉన్నాయని సీపీఐ జాతీయ కార్యవర్గ సభ్యుడు చాడ వెంకటరెడ్డి (Chada Venkat Reddy) అన్నారు. ఈ మేరకు ఆయన ఇవాళ ఒక ప్రకటనలో తెలిపారు. ఎస్ఎల్‌బీసీ ప్రపంచంలోనే అతిపెద్ద సొరంగ మార్గమని, 20 సార్లు మార్పులు చేయడం వలన సొరంగ మార్గం అంచనాలు పెరిగి మరింత ఆలస్యం జరిగిందని కీలక వ్యాఖ్యలు చేశారు. గత ప్రభుత్వ కాలంలో పనులు చేపట్టకపోవడం వలన పై కప్పు స్లాబ్ తుప్పు పట్టి ఈ ప్రమాదం జరిగిందని, గత ప్రభుత్వ పాలకుల నిర్లక్ష్యం వలనే ఈ ఘటన జరిగిందని ఆయన ఆరోపించారు.

2007, 2015లో కృష్ణా నది పరివాహక ప్రాంతాలను (CPI) సీపీఐ బృందం సందర్శించినప్పుడు శ్రీశైలం సొరంగ మార్గం త్వరగా పూర్తి చేసి నల్లగొండ జిల్లాకు నీరందించాలని చెప్పడం జరిగిందని అప్పుడే పనులు ప్రారంభించినా, గత ప్రభుత్వ కాలంలో పదేళ్లపాటు పనులు చేపట్టకపోవడం వలన మరింత ఆలస్యం జరిగిందన్నారు. ఈ ఘటనలో ప్రమాదానికి గురైన వారిని యుద్ధ ప్రాతిపదికన రక్షించాలని, ఈ ఘటనపై సమగ్ర విచారణ చేపట్టాలని చాడ వెంకటరెడ్డి డిమాండ్ చేశారు.

Next Story