- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
తెలంగాణలో SIR.. ఓటరు జాబితా సవరణపై సీఈవో సుదర్శన్ రెడ్డి సమీక్ష
రాష్ట్ర వ్యాప్తంగా జరగనున్న ప్రత్యేక విస్తృత ఓటరు జాబితా సవరణ (స్పెషల్ ఇంటెన్సీవ్ రివిజన్ – ఎస్ఐఆర్)కు రాష్ట్ర యంత్రాంగం సిద్దమవుతోంది.

దిశ, తెలంగాణ బ్యూరో : రాష్ట్ర వ్యాప్తంగా జరగనున్న ప్రత్యేక విస్తృత ఓటరు జాబితా సవరణ (Special Intensive Revision–SIR)కు రాష్ట్ర యంత్రాంగం సిద్దమవుతోంది. ఇప్పటికే బిహర్లో ఎస్ఐఆర్ పూర్తి చేసిన కేంద్ర ఎన్నికల సంఘం దేశంలోని అన్ని రాష్ట్రాల్లో (SIR) ఎస్ఐఆర్ను చేపట్టడానికి సిద్దమైంది. గత నెల 15న, ఈ నెల 22, 23 తేదీల్లో రాష్ట్రాల సీఈవోలతో కేంద్ర ఎన్నికల సంఘం ఏర్పాట్లపై సమీక్ష సమావేశం నిర్వహించింది. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో ఎస్ఐఆర్ కార్యక్రమంపై శనివారం జిల్లా కలెక్టర్లు, నియోజకవర్గ ఈఆర్వోలతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. సీఈఓ సుధర్శన్ రెడ్డి (CEO Sudarshan Reddy) మాట్లాడుతూ, రాబోయే ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని పారదర్శకంగా, తప్పులేని, సమగ్ర ఓటర్ల జాబితాను సిద్ధం చేయడమే ఎన్నికల అధికారులుగా తమ ప్రధాన లక్ష్యమని ఆయన పేర్కొన్నారు. ఎస్ఐఆర్కు అవసరమైన అన్ని ఏర్పాట్లను వచ్చే నెల 1వ తేదీలోగా ఏర్పాట్లు అన్ని పూర్తిచేయాలని సీఈవో సుదర్శన్ రెడ్డి ఆదేశించారు.
ప్రత్యేక విస్తృత సవరణలో భాగంగా చేపట్టాల్సిన అన్ని కార్యక్రమాలు నిర్ణీత గడువులో పూర్తిచేయాలని, పెండింగ్ పనులను వేగవంతం చేయాలని అధికారులను సీఈవో ఆదేశించారు. ప్రతి నియోజకవర్గం, పోలింగ్ స్టేషన్ వారీగా పురోగతిని సమీక్షిస్తూ, ఖచ్చితమైన, లోపరహితంగా ఓటర్ల జాబితా తయారీ పై దృష్టి పెట్టాలని ఆయన సూచించారు. జిల్లా కలెక్టర్లు, ఈఆర్వోలతో మళ్లీ వచ్చే నెల 1వ తేదీన వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించనున్నట్లు సీఈవో ప్రకటించారు. అప్పటి కల్లా అన్ని పనులు పూర్తవ్వాలని ఆయన కలెక్టర్లను ఆదేశించారు. సమీక్షా సమావేశంలో అదనపు ముఖ్య ఎన్నికల అధికారి లోకేశ్ కుమార్, ఉప ముఖ్య ఎన్నికల అధికారి హరి సింగ్, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఎస్ఐఆర్కు అవసరమైన సంబంధించిన 2002 నాటి ఓటరు జాబితాను ఎన్నికల సంఘం వెబ్ సైట్ లో అందుబాటులో ఉంచారు.






