కొత్త సంస్కరణలతో ఎన్నికలు..! జూబ్లీహిల్స్‌ ఉప ఎన్నికపై రాజకీయ పార్టీలతో సీఈవో సుదర్శన్‌రెడ్డి భేటీ

by Ramesh Naini |

జూబ్లీహిల్స్‌ అసెంబ్లీ నియోజకవర్గ ఉప ఎన్నిక షెడ్యూల్‌ ప్రకటించిన నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి (సీఈవో) సి. సుదర్శన్‌రెడ్డి రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశం అయ్యారు.

కొత్త సంస్కరణలతో ఎన్నికలు..! జూబ్లీహిల్స్‌ ఉప ఎన్నికపై రాజకీయ పార్టీలతో సీఈవో సుదర్శన్‌రెడ్డి భేటీ
X

దిశ, డైనమిక్ బ్యూరో: (Jubilee Hills by-election)జూబ్లీహిల్స్‌ అసెంబ్లీ నియోజకవర్గ ఉప ఎన్నిక షెడ్యూల్‌ ప్రకటించిన నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి (సీఈవో) సి. సుదర్శన్‌రెడ్డి (CEO Sudarshan Reddy) రాజకీయ పార్టీల (political parties) ప్రతినిధులతో సమావేశం అయ్యారు. మంగళవారం నిర్వహించిన సమావేశంలో బీజేపీ, కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌, ఆమ్‌ ఆద్మీ పార్టీ, మజ్లిస్‌ (ఎంఐఎం) తదితర పార్టీల ప్రతినిధులు పాల్గొన్నారు. జూబ్లీహిల్స్‌ ఉప ఎన్నికలకు సంబంధించి ఏర్పాట్లు, ఎన్నికల నియమావళి అమలు, ప్రవర్తనా నియమావళి పాటింపు వంటి అంశాలపై చర్చ జరిగింది.

ఈ సందర్భంగా సీఈవో సుదర్శన్‌రెడ్డి మాట్లాడుతూ.. రానున్న ఉప ఎన్నికలు ప్రధాన ఎన్నికల కమిషనర్‌ జ్ఞానేశ్‌కుమార్‌ ప్రవేశపెట్టిన కొత్త ఎన్నికల సంస్కరణలతో నిర్వహించబడనున్నట్లు వెల్లడించారు. ఈ సంస్కరణలు మొదట బీహార్‌ ఉప ఎన్నికల్లో అమలుకావడం జరిగి, ఆపై దేశవ్యాప్తంగా జరగనున్న 8 అసెంబ్లీ నియోజకవర్గాల ఉప ఎన్నికల్లో అమల్లోకి రానున్నాయని ఆయన తెలిపారు.కొత్త మార్పుల వివరాలను రాజకీయ పార్టీలకు తెలియజేశారు. ఎన్నికల నిర్వహణకు అన్ని వర్గాల సహకారం అవసరమని ఆయన సూచించారు.

Next Story