- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఆమె సడన్‌గా ఇంగ్లాండ్ వెళ్లడానికి రీజన్ ఇదే.. మిస్ వరల్డ్ CEO వివరణ
ఇదిగో తోక అంటే అదిగో పులి అన్న చందంగా మారింది బీఆర్ఎస్ సోషల్ మీడియా వ్యవహారం.

దిశ, తెలంగాణ బ్యూరో: ఇదిగో తోక అంటే అదిగో పులి అన్న చందంగా మారింది బీఆర్ఎస్ సోషల్ మీడియా వ్యవహారం. తప్పుడు ఆరోపణలతో రాష్ట్రంలో ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న మిస్ వరల్డ్ పోటీలపై దుష్ప్రచారం చేస్తున్నారు. ఎక్కడ తప్పు దోరుకుతుందా అని వెతికి మరీ తమ అక్కసును వెలిబుచ్చే ప్రయత్నం చేస్తున్నారు. సొంత ప్రయోజనాల కోసం రాష్ట్ర ప్రతిష్టతను దిగజార్చే ప్రయత్నం చేస్తున్నారు. అయితే సోషల్ మీడియాలో తప్పుగా ప్రచారం అవుతున్న వార్తలపై మిస్ వరల్డ్ సంస్థ సీఈఓ వివరణ ఇచ్చారు.
మిస్ వరల్డ్ సంస్థ చైర్‌పర్సన్ జూలియా మోర్లే వివరణ:
ఇండియాలో జరుగుతున్న 72వ మిస్ వరల్డ్ పోటీల నుండి మిస్ ఇంగ్లాండ్-2025 మిల్లా మాగీ వైదొలగిన విషయాలపై మిస్ వరల్డ్ సంస్థ స్పందించింది. ఇటీవల బ్రిటిష్ మీడియాలో ప్రచారంలో ఉన్న కథనాలపై మిస్ వరల్డ్ సంస్థ చైర్ పర్సన్, సీఈఓ జూలియా మోర్లే శనివారం స్పందించారు. ఆ మేరకు ఒక ప్రకటన విడుదల చేస్తూ, మిస్ ఇంగ్లాండ్ మాగీ ఆరోపణలను ఖండించారు. ఈ నెల ప్రారంభంలో, మిస్ ఇంగ్లాండ్ మిల్లా మాగీ తన తల్లి, కుటుంబ సభ్యుల ఆరోగ్యానికి సంబంధించి అత్యవసర పరిస్థితి కారణంగా ఈ పోటీల నుంచి విరమించుకోవాలని సంస్థను కోరినట్లు ఆమె తెలిపారు. మిల్లా పరిస్థితిని అర్థం చేసుకొని జూలియా మోర్లే వెంటనే స్పందించి, ఆమె కుటుంబ సభ్యుల సంక్షేమాన్ని ప్రథమ ప్రాధాన్యతగా పరిగణించారని, తక్షణమే ఆమెను ఇంగ్లాండ్‌కు తిరిగి పంపే ఏర్పాట్లు చేసినట్లు ఆమె పేర్కొన్నారు. మిస్ మిల్లా పోటీల నుండి వైదొలిగిన తర్వాత, మిస్ ఇంగ్లాండ్ మొదటి రన్నరప్ అయిన మిస్ షార్లెట్ గ్రాంట్ ఆమె ఇంగ్లాండ్ తరపున ప్రాతినిధ్యం వహించేందుకు ముందుకొచ్చారని జూలియా మోర్లే ప్రకటనలో తెలిపారు. మిస్ షార్లెట్ బుధవారం ఇండియాకు చేరుకున్నారని, ఆమెను పోటీలలో పాల్గొనేందుకు అనుమతించామని, ఈ పోటీలలో ఆమె పాల్గొంటున్నారని ప్రకటనలో పేర్కొన్నారు.
యూకే మీడియా దుష్ప్రచారం:
ఇటీవల బ్రిటిష్ మీడియాలో ప్రచారంలో ఉన్న కథనాలపై, కొన్ని యూకే మీడియా సంస్థలు మిల్లా మాగీ పోటీలలో ఎదుర్కొన్న అనుభవాలపై తప్పుడు, అపవాదకరమైన కథనాలను ప్రచురించినట్లు సంస్థకు తెలియడంతో ఆ ఆరోపణలను ఖండిస్తూ, ఆ కథనాలు పూర్తిగా నిరాధారమైనవని జూలియా మోర్లే ప్రకటనలో తెలిపారు. మిస్ వరల్డ్ పోటీల ప్రారంభ సమయంలో మిస్ మిల్లా మాగీ స్వయంగా వ్యక్తపరిచిన భావాలు, ఎడిట్ చేయని వీడియో క్లిప్‌లను మిస్ వరల్డ్ సంస్థ విడుదల చేసిందన్నారు. అందులో ఆమె ఆనందాన్ని, కృతజ్ఞతను, ఈ అనుభవాన్ని మెచ్చుకుంటూ మాట్లాడిన దృశ్యాలు కూడా ఉన్నాయని, తాజాగా ప్రచురితమైన తప్పుడు కథనాలు నిరాధారమైనవని, ఆ ఆరోపణలను ఖండిస్తూ జూలియా మోర్లే వివరించారు.
బ్యూటీ విత్ పర్పస్:
మిస్ వరల్డ్ సంస్థ నిజాయితీ, గౌరవం, బ్యూటీ విత్ ఏ పర్పస్ అనే విలువలకు కట్టుబడి, నిబద్ధంగా పోటీలు కొనసాగుతున్నాయన్నారు. మీడియా సంస్థలు జర్నలిస్టిక్ విలువలు పాటిస్తూ, తప్పుడు సమాచారాన్ని ప్రచురించే ముందు తగు ఆదారాలతో, వివరణతో ధృవీకరించుకోవాలని జూలియా మోర్లే ప్రకటనలో విజ్ఞప్తి చేశారు.






