- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
తెలంగాణకు గుడ్ న్యూస్.. 'ప్రసాద్' స్కీమ్ కింద బల్కంపేట ఆలయ అభివృద్ధికి కేంద్రం ఆమోదం
దేశంలో ఆలయాల అభివృద్ధి, టెంపుల్ టూరిజం కోసం కేంద్రం ప్రభుత్వం కొత్తగా 'ప్రసాద్' పథకం తీసుకొచ్చిన విషయం తెలిసిందే.

దిశ, తెలంగాణ బ్యూరో/ డైనమిక్ బ్యూరో: తెలంగాణ ప్రజలకు కేంద్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. దేశంలో ఆలయాల అభివృద్ధి, టెంపుల్ టూరిజం కోసం కేంద్రం ప్రభుత్వం కొత్తగా 'ప్రసాద్' పథకం తీసుకొచ్చిన విషయం తెలిసిందే. ఇందులో భాగంగా కొత్తగా తీసుకొచ్చిన ‘ప్రసాద్’ ('Prasad' scheme) పథకం కింద హైదరాబాద్‌లోని బల్కంపేట (Balkampet temple) రేణుకా ఎల్లమ్మ దేవస్థానంలో అభివృద్ధి పనులకు కేంద్రం ఆమోదం తెలిపింది. ఈ ప్రాజెక్టు వివరాలను స్వయంగా ఎక్స్ వేదికగా (Gajendra Singh Shekhawat) కేంద్ర పర్యాటక శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షేకావత్ వెల్లడించారు. ఈ ప్రాజెక్టు ద్వారా రూ. 4.21 కోట్ల వ్యయంతో, ఒకేసారి 200 మందికి పైగా వసతి కల్పించే ఆధునిక సౌకర్యాలతో కూడిన 3 అంతస్తుల అన్నదాన భవనాన్ని అభివృద్ధి చేస్తామని ప్రకటించారు.
ఈ సందర్భంగా కేంద్ర మంత్రి, బీజేపీ స్టేట్ చీఫ్ కిషన్‌రెడ్డి (Union Minister Kishan Reddy) హర్షం వ్యక్తం చేశారు. రేణుకా ఎల్లమ్మ దేవస్థానం అభివృద్ధి ప్రాజెక్టుకు ఆమోదం తెలిపినందుకు ప్రధాని మోడీ, కేంద్ర మంత్రి గజేంద్ర సింగ్ షేకావత్ లకు ధన్యవాదాలు తెలిపారు. ఇది భక్తులకు సౌకర్యాలను పెంచడమే కాకుండా హైదరాబాద్‌లో ఆలయం ఆధ్యాత్మిక వారసత్వాన్ని కాపాడటానికి కూడా దోహదపడుతుందని కొనియాడారు. కాగా, గతంలో తెలంగాణలోని ప్రముఖ ప్రసిద్ధి చెందిన పుణ్యక్షేత్రం వేములవాడ శ్రీ రాజరాజేశ్వరస్వామి ఆలయం ప్రసాద్ పథకంలో స్థానం సంపాదించిన విషయం తెలిసిందే. ఈ ఆలయంలో 100 గదుల సామర్థ్యం గల అతిథి గృహం, అన్నప్రసాద భవనం, క్యూ కాంప్లెక్స్‌లను అభివృద్ధికి ఆమోదం తెలిపారు.






