- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Banakacharla Project Issue: ఏపీ ప్రభుత్వానికి కేంద్ర జల సంఘం లేఖ
ఏపీలోని ఎన్డీఏ ప్రభుత్వానికి(AP Government) కేంద్ర జల సంఘం(Central Water Commission) లేఖ రాసింది.

దిశ, వెబ్‌డెస్క్: ఏపీలోని ఎన్డీఏ ప్రభుత్వానికి(AP Government) కేంద్ర జల సంఘం(Central Water Commission) లేఖ రాసింది. పోలవరం-బనకచర్ల ప్రాజెక్ట్(Banakacharla Project) వివరాలు ఇవ్వాలని పేర్కొంది. గోదావరి వరద జలాలకు సంబంధించి డేటా కోరింది. రాష్ట్రంలో ప్రతిపాదిక ప్రాజెక్ట్‌ల వివరాలపై నివేదిక ఇవ్వాలని లేఖలో పేర్కొన్నట్లు సమాచారం. కాగా, ఇటీవలే బనకచర్ల ప్రాజెక్ట్ విషయంలో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. బనకచర్ల ప్రాజెక్ట్‌కు పర్యావరణ అనుమతులు ఇచ్చేందుకు నిరాకరించింది. బనకచర్ల ప్రాజెక్ట్‌కు పర్యావరణ అనుమతులు ఇవ్వలేమని ఆంధ్రప్రదేశ్‌కు తేల్చిచెప్పింది. ఈ మేరకు బనకచర్ల ప్రాజెక్ట్ కోసం ఆంధ్రప్రదేశ్ పంపిన ప్రతిపాదనలను కేంద్ర ప్రభుత్వం తిప్పిపంపింది. బనకచర్ల ప్రాజెక్ట్‌కు అనుమతులు ఇవ్వాలంటే సెంట్రల్ వాటర్ కమిషన్ (సీడబ్ల్యూసీ) పరిశీలించాల్సి ఉందని.. ఈ మేరకు సీడబ్ల్యూసీని అప్రోచ్ కావాలని ఏపీకి సూచించింది. సీడబ్ల్యూసీతో కలిసి ఫ్లడ్ వాటర్ అవేలబులిటి అస్సెస్ చేయాలని పేర్కొంది. అంతరాష్ట్ర జల వివాదానికి క్లియరెన్స్ తెచ్చుకోవాలని ఆంధ్రప్రదేశ్‌కు సూచించింది.






