- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
కేంద్ర మత్రి కిషన్ రెడ్డికి అస్వస్థత.. ఎయిమ్స్‌కు తరలింపు!
కేంద్ర పర్యాటకశాఖ మంత్రి కిషన్ రెడ్డి అస్వస్థతకు గురయ్యారు. ఆదివారం రాత్రి ఒక్కసారిగా ఛాతిలో నొప్పి రావడంతో ఆయన్ను కుటుంబసభ్యులు కిషన్ రెడ్డిని ఢిల్లీలోని ఎయిమ్స్‌కు తరలించారు.

X
దిశ, వెబ్‌డెస్క్: కేంద్ర పర్యాటకశాఖ మంత్రి కిషన్ రెడ్డి అస్వస్థతకు గురయ్యారు. ఆదివారం రాత్రి ఒక్కసారిగా ఛాతిలో నొప్పి రావడంతో ఆయన్ను కుటుంబసభ్యులు ఢిల్లీలోని ఎయిమ్స్‌కు తరలించారు. ప్రస్తుతం డాక్టర్ల బృందం కిషన్ రెడ్డికి చికిత్స అందిస్తోంది. గ్యాస్ ట్రబుల్‌తోనే ఆయన ఆసుపత్రిలో చేరినట్లు వైద్యులు వెల్లడించారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యానికి ఎలాంటి ఇబ్బంది లేదని, ఎవరూ ఆందోళన పడాల్సిన అవసరం లేదని కిషన్ రెడ్డి కుటుంబసభ్యులు తెలిపారు. కాగా, అంతకుముందు.. కిషన్ రెడ్డి ప్రధాన మంత్రి ‘మన్ కీ బాత్’ వందో ఎపిసోడ్‌ను ఢిల్లీలోని నేషనల్ గ్యాలరీ ఆఫ్ మోడ్రన్ ఆర్ట్ ప్రాంగణంలో వీక్షించారు.
Next Story






