- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
స్వస్థ నారీ, సశక్త్ పరివార్ అభియాన్ పథకం మహిళలు ఉపయోగించుకోవాలి: బండి సంజయ్
కేంద్ర ప్రభుత్వం ప్రధాని మోడీ జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని స్వస్థ నారీ, సశక్త్ పరివార్ అభియాన్ పేరిట నిర్వహిస్తున్న ప్రత్యేక ఆరోగ్య కార్యక్రమాలను మహిళలు వినియోగించుకోవాలని కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ కోరారు.

దిశ, తెలంగాణ బ్యూరో : కేంద్ర ప్రభుత్వం ప్రధాని మోడీ జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని స్వస్థ నారీ, సశక్త్ పరివార్ అభియాన్ పేరిట నిర్వహిస్తున్న ప్రత్యేక ఆరోగ్య కార్యక్రమాలను మహిళలు వినియోగించుకోవాలని కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ కోరారు. ప్రధాన మంత్రి మాతృ వందన యోజన కార్యక్రమంలో భాగంగా ఇప్పటి వరకు తల్లుల బ్యాంకు ఖాతాల్లో రూ.19 వేల కోట్ల నగదును జమ చేసినట్లు తెలిపారు. బుధవారం అమీర్ పేటలోని కమ్యూనిటీ హెల్త్ సెంటర్ లో రాష్ట్ర మంత్రి దామోదర రాజనర్సింహాలతో కలిసి ఈ కార్యక్రమాన్ని వర్చువల్ గా వీక్షించారు. ఈసందర్భంగా ఒక ప్రకటనలో పేర్కొంటూ స్వస్థ నారీ, సశక్త్ పరివార్ అభియాన్ 15 రోజులపాటు దేశవ్యాప్తంగా ఆయుష్మాన్ ఆరోగ్య మందిరాలు , కమ్యూనిటీ హెల్త్ సెంటర్లు , ఇతర ఆరోగ్య కేంద్రాల్లో పెద్ద ఎత్తున ఆరోగ్య శిబిరాలు నిర్వహించబోతున్నామని తెలిపారు.
మహిళలకు బీపీ, షుగర్ , స్క్రీనింగ్, నోటి క్యాన్సర్, బ్రెస్ట్ క్యాన్సర్, సర్వికల్ క్యాన్సర్ స్క్రీనింగ్ టెస్టులు నిర్వహిస్తారని, యువతులకు, మహిళలకు అనీమియా పరీక్షలు నిర్వహించడంతోపాటు తగిన కౌన్సెలింగ్ అందిస్తారని పేర్కొన్నారు. క్షయ పరీక్షలతోపాటు గిరిజన ప్రాంతాల్లో సికిల్ సెల్ వ్యాధి స్క్రీనింగ్ టెస్టులు నిర్వహించడమే కాకుండా ఈ శిబిరాల్లో గైనకాలజిస్టులు, నేత్ర వైద్యులు, చర్మ వైద్యులు, మానసిక వైద్యులు, డెంటల్ డాక్టర్లు అందుబాటులో ఉంటారని వెల్లడించారు. మహిళలంతా ఈ సేవలను వినియోగించుకోవాలని కోరారు. ప్రధాన మంత్రి మాతృ వందన యోజనలో భాగంగా ఇప్పటి వరకు 4 కోట్ల మందికిపైగా తల్లులకు కేంద్రం లబ్ధి చేకూర్చింది. వారి ఖాతాల్లోకి నేరుగా రూ.19 వేల కోట్లు జమ చేసినట్లు తెలిపారు. మొదటి సంతానంకు రూ.5 వేల ఆర్ధిక సాయం ఇప్పటికే కేంద్రం అందిస్తోందని, ఒకవేళ రెండో సంతానం అమ్మాయి పుడితే అదనంగా మరో రూ. 6 వేల సహాయం అందిస్తున్నట్లు వివరించారు.






