- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
కేంద్ర సర్కార్ కీలక నిర్ణయం.. రాష్ట్రానికి మల్టీమోడల్ లాజిస్టిక్స్ పార్క్
లాజిస్టిక్స్ మౌలిక సదుపాయాలను ఆధునీకరించడానికి, సరుకు రవాణా ఖర్చులను తగ్గించడానికి కేంద్రం మల్టీ మోడల్ లాజిస్టిక్స్ పార్క్‌ల ఏర్పాటుపై దృష్టి సారించింది.

దిశ, తెలంగాణ బ్యూరో: లాజిస్టిక్స్ మౌలిక సదుపాయాలను ఆధునీకరించడానికి, సరుకు రవాణా ఖర్చులను తగ్గించడానికి కేంద్రం మల్టీ మోడల్ లాజిస్టిక్స్ పార్క్‌ల ఏర్పాటుపై దృష్టి సారించింది. అందులో భాగంగా రాష్ట్రంలో మల్టీ మోడల్ లాజిస్టిక్స్ పార్క్‌ను ఏర్పాటు చేయనున్నట్లు కేంద్రం ఇటీవలే ప్రకటించింది. ఈ పార్క్‌ను 315 ఎకరాల విస్తీర్ణంలో నిర్మించేందుకు ప్రణాళికులు సిద్ధం చేస్తోంది. దీని ద్వారా ఏటా1.47 మిలియన్ మెట్రిక్ టన్నుల సరుకులను రవాణ చేసేందుక వీలుగా నిర్మించనున్నారు. కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల మంత్రిత్వ శాఖ మెదక్ జిల్లా మనోహరాబాద్ మండలంలోని పార్కిబండ గ్రామంలో మల్టీ-మోడల్ లాజిస్టిక్స్ పార్క్‌ను అభివృద్ధి చేయాలని ప్రతిపాదించింది. 315 ఎకరాల విస్తీర్ణంలో నిర్మించనున్న ఈ పార్క్ ద్వారా ఇక్కడి ప్రాంతం అన్ని రంగాల్లోనూ అభివృద్ధి చెందుతోంది. రవాణా రంగంలో నిరుద్యోగులకు ఉద్యోగా, ఉపాధి అవకాశాలు ఏర్పడనున్నాయి. హైదరాబాద్ చుట్టుపక్కల ప్రాంతాల్లోని పరిశ్రమల్లో అయిన ఉత్పత్తులను ఇక్కడి నుంచి దేశ వ్యాప్తంగా ఎక్కడికైనా సరుకులను రవాణా చేసేందుకు వీలుగా సౌకర్యాలు కల్పించనున్నారు.
పారిశ్రామిక ప్రాంతాలకు కేంద్ర బిందువు
ప్రస్తుతం సనత్‌నగర్, అజామాబాద్, జీడిమెట్ల, బాలానగర్, చెర్లపల్లి పారిశ్రామిక ప్రాంతాలకు పార్కిబండా మల్టీ మోడల్ లాజిస్టిక్ పార్క్ కేంద్ర బిందువుగా మారనున్నది. ఆయా పారిశ్రామిక వాడల్లో చేసిన ఉత్పత్తులను మల్టీ మోడల్ లాజిస్టిక్ పార్కుకు చేరవేసి అక్కడి నుంచి ముంబాయి, పూనే, బెంగుళూరు, చెన్నై, అహ్మదాబాద్, విశాఖపట్నం, కాకినాడ, తదితర ప్రాంతాలకు రవాణా చేసేందుకు వీలుగా పూనే-విజవాడ జాతీయ రహదారికి అనుసంధానం చేయనున్నారు. సరుకులను సులభంగా రవాణ చేయడం, వివిధ ప్రాంతాలకు కనెక్టివిటినీ మెరుగుపరచడం, ఆర్థిక వృద్ధిని ప్రోత్సహించే లక్ష్యంతో భవిషత్ ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని ఈ సరుకు రవాణా లాజిస్టిక్ పార్కును నిర్మిస్తున్నారు. 2028 నాటికి మల్టీ మోడల్ లాజిస్టిక్స్ పార్క్ పూర్తి చేసి, ఏటా 1.47 మిలియన్ మెట్రిక్ టన్నుల సరుకులను రవాణా చేసేందుకు కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల మంత్రిత్వ శాఖ లక్ష్యంగా పెట్టుకొంది. 2070 నాటికి వీటి రవాణా19.98 మిలియన్ మెట్రిక్ టన్నుల వరకు పెరుగుతుందని అంచనా వేస్తోంది.
ఎన్‌హెచ్-44కి అనుసంధానం
మల్టీ మోడల్ లాజిస్టిక్స్ పార్క్ మనోహరాబాద్ రైల్వే స్టేషన్ నుండి 5 కిలోమీటర్ల లోపు ఉంది. ప్రాంతీయ రింగ్ రోడ్డు పూర్తయిన తర్వాత, ముంబై, జవహర్‌లాల్ నెహ్రూ పోర్ట్ వంటి ప్రధాన సరుకు రవాణా కారిడార్‌లకు సరుకులు చేరవేసేందుకు సులభంగా ఉంటుందని కేంద్రం భావిస్తోంది. అంతే కాకుండా ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తవు. ఇతర ప్రాంతాలకు సులభంగా సరుకులు రవాణా చేవచ్చు. అంతే కాకుండా కార్గో అగ్రిగేషన్, డిస్అగ్రిగేషన్, రైలు టెర్మినల్, రోడ్డు నుంచి రైల్వేలకు ఇంటర్ మోడల్ మార్పు, గిడ్డంగులు, విలువ ఆధారిత సేవలు మొదలైనవి అభివృద్ధి చెందనున్నాయి. వీటితో పాటు ట్రక్ పార్కింగ్‌లు, వాణిజ్య ప్రాంతాల అనుబంధం తదితర సౌకర్యాలు మేరుగుపడనున్నాయి. హైదరాబాద్, చుట్టుపక్కల పరిశ్రమలకు ప్రయోజనం కలుగుతుంది.






