- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Central: రోడ్డు ప్రమాద బాధితులకు క్యాష్‌లెస్ ట్రీట్మెంట్ పథకం.. కేంద్ర ప్రభుత్వం కీలక సమాధానం
రోడ్డు ప్రమాద బాధితులకు క్యాష్‌లెస్ ట్రీట్మెంట్ పథకంపై కేంద్ర ప్రభుత్వం కీలక సమాధానం ఇచ్చింది.

దిశ, తెలంగాణ బ్యూరో/ డైనమిక్ బ్యూరో: 2025 జూలై 31 వరకు 4,971 రోడ్డు ప్రమాద బాధితులకు క్యాష్ లెస్ పథకం కింద ట్రీట్ మెంట్ అదించబడిందని కేంద్ర ప్రభుత్వం లోక్ సభకు తెలిపింది. రోడ్డు ప్రమాద బాధితులకు రూ.1.50 లక్షల నగదు రహిత చికిత్స పథకాన్ని 5 మే 2025 నుంచి దేశవ్యాప్తంగా అమలు చేయాలని చేస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వం నోటిఫికేషన్ ద్వారా ప్రకటించిదని ఈ పథకానికి సంబంధించి మార్గదర్శకాలను 4 జూన్ 2025 న నోటిఫై చేయబడ్డాయని కేంద్ర రోడ్డు, రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ వివరించారు. టీడీపీ సభ్యులు జి.లక్ష్మీనారాయణ, డా.బైరెడ్డి శబరి అడిగిన ప్రశ్నలకు బదులుగా కేంద్రం సమాధానం ఇచ్చింది.
ఈ పథకం ప్రకారం మోటార్ వాహనంలో ప్రయాణిస్తుండగా యాక్సిడెంట్ జరిగితే ఒక్కో బాధిత వ్యక్తి ప్రమాదం జరిగిన తేదీ నుంచి గరిష్టంగా 7 రోజుల వరకు రూ. 1.5 లక్షల వరు దేశవ్యాప్తంగా గుర్తించబడి ఏ ఆసుపత్రిలోనైనా ఉచితంగా చికిత్స పొందవచ్చని క్లారిటీ ఇచ్చింది. తొలుత లైలట్ ప్రోగ్రామ్ ను 6 రాష్ట్రాల్లో మరియు కేంద్ర పాలిట ప్రాంతాల్లో 2024 మార్చిలో ప్రారంభించామని తెలిపారు. ఇందుకు సంబంధించిన నిధులను ప్రమాదం జరిగిన వాహనం బీమా చేయబడినట్లయితే జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీలు, బీమా లేని వాహనాలతో ప్రమాదం జరిగితే కేంద్ర ప్రభుత్వం బడ్జెట్ కేటాయిస్తుందని తెలిపారు. 2025 ఆర్థిక సంవత్సరంలో బీమా లేని కేసుల కోసం కేంద్ర ప్రభుత్వం రూ. 272 కోట్లు కోటాయించినట్లు తెలిపారు. ఈ పథకం కోసం నిర్ణయించిన ఆర్థిక పరిమితి రూ. 1.5 లక్షలు సరిపోతాయా అన్నదనిపై సమీక్ష చేపట్టామని అత్యతధిక శాతం ట్రామా సంబంధింత చికిత్సలు రూ.1,50.000 పరిమితిలోనే 7 రోజుల వ్యవధిలోనే పూర్తవుతాయని తేలిందన్నారు.






