పంచాయతీలకు గుడ్ న్యూస్.. మరో రూ.387 కోట్లు విడుదల

by Naga Rani Yarlagadda |

తెలంగాణ గ్రామపంచాయతీలకు కేంద్ర శుభవార్త అందించింది. వారంరోజుల క్రితం 15వ ఆర్థిక సంఘం నిధుల విడుదలలో భాగంగా తొలివిడతలో రూ.259.36 కోట్లు రిలీజ్ చేసింది.

పంచాయతీలకు గుడ్ న్యూస్.. మరో రూ.387 కోట్లు విడుదల
X

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణ గ్రామపంచాయతీలకు కేంద్ర శుభవార్త అందించింది. వారంరోజుల క్రితం 15వ ఆర్థిక సంఘం నిధుల విడుదలలో భాగంగా తొలివిడతలో రూ.259.36 కోట్లు రిలీజ్ చేసింది. తాజాగా మరో రూ.387 కోట్ల నిధులను విడుదల చేసింది. గ్రామపంచాయతీ ఎన్నికలు ఆలస్యం కావడంతో.. 15వ ఆర్థిక సంఘం నిధుల విడుదల కూడా ఆలస్యమైంది. రెండు విడతల్లో కలిపి మొత్తం రూ.646.46 కోట్లను రిలీజ్ చేసింది. ఈ నిధులతో గ్రామ పంచాయతీల్లో పెండింగ్లో ఉన్న పనులకు, మౌలిక సదుపాయాల కల్పనకు ఊతం లభించనుంది. ఇంకా రూ.2400 కోట్ల నిధులు కేంద్రం నుంచి గ్రామపంచాయతీలకు రావలసి ఉంది. గ్రామాల్లో అభివృద్ధి కుంటుపడకుండా ఉండాలంటే కేంద్రం పెండింగ్ లో ఉన్న నిధులను యుద్ధప్రాతిపదికన విడుదల చేయాలని రాష్ట్ర పంచాయతీశాఖ మంత్రి సీతక్క విజ్ఞప్తి చేశారు. కేంద్రం చెప్పిన నిబంధనలన్నీ రాష్ట్ర ప్రభుత్వం పాటించిందని, సకాలంలో ఫండ్స్ అందితేనే గ్రామాల రూపురేఖలు అభివృద్ధితో మారుతాయన్నారు.

Next Story