- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
పాకిస్థాన్ టార్గెట్ హైదరాబాద్, వైజాగ్.. గుర్తించిన కేంద్ర ప్రభుత్వం
పహెల్గాం ఉగ్రదాడి అనంతరం భారత్-పాకిస్తాన్‌ల మధ్య తీవ్ర ఉద్రిక్తతలు నెలకొన్న విషయం తెలిసిందే.

పహెల్గాం ఉగ్రదాడి అనంతరం భారత్-పాకిస్తాన్‌ల మధ్య తీవ్ర ఉద్రిక్తతలు నెలకొన్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో అత్యవసర సమయాల్లో ఎలా స్పందించాలనే దానిపై పౌరులను సమాయత్తం చేసేందుకు రేపు దేశవ్యాప్తంగా మాక్ డ్రిల్ నిర్వహించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు అన్ని రాష్ట్రాలకు, కేంద్ర పాలిత ప్రాంతాలకు ఆదేశాలు జారీ చేసింది. ఈ నేపథ్యంలో ఇవాళ యుద్ధ సన్నద్ధతపై కేంద్ర హోంశాఖ కార్యదర్శి గోవింద్ మోహన్ కీలక సమీక్ష సమావేశం నిర్వహించారు. రేపటి మాక్ డ్రిల్స్‌పై రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు దిశానిర్దేశం చేశారు. యుద్ధం వస్తే ప్రజలను ఎలా రక్షించాలి? ప్రజలు స్వీయ రక్షణ ఎలా పొందాలి? పాక్ దాడులను ఎలా తప్పించుకోవాలో తెలుసుకోవాలంటే ఈ లింక్ ఓపెన్ చేసి చూడండి.
మృగశిర కార్తె సందర్భంగా హైదరాబాద్‌లోని నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్‌లో చేప ప్రసాదం పంపిణీకి ముహూర్తం ఖరారయింది. బత్తిని కుటుంబ సభ్యులు 178 సంవత్సరాలుగా కొనసాగిస్తున్న ఈ చేప ప్రసాదం ఆస్తమా, ఇతర శ్వాసకోశ సమస్యల నుంచి ఉపశమనం కలిగిస్తుందని ప్రజలు నమ్ముతారు. గత ఏడాది మాదిరిగానే ఈ సంవత్సరం కూడా చేప ప్రసాదం అందించనున్నట్లు బత్తిని వంశస్తులు ప్రకటించారు. ఈ మేరకు చేప ప్రసాదం పంపిణీ తేదీలను వెల్లడించారు. ఆ డేట్స్ ఏవో ఈ లింక్ ఓపెన్ చేసి చూడండి.
పోలవరం నిర్మాణంపైనే రాష్ట్ర అభివృద్ధి ఆధారపడి ఉందని జల వనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు. ఆయన ఇవాళ పోలవరం ప్రాజెక్ట్ వద్ద పర్యటించారు. ఎగువ కాఫర్ డ్యామ్ బలోపేతం చేసేలా నిర్మిస్తున్న బట్రస్ డ్యామ్, గ్యాప్-2 డి వాల్ పనులను పరిశీలించారు. ప్యానల్ అఫ్ ఎక్స్పర్ట్టీం ను మంత్రి నిమ్మల కలిశారు. పోలవరం ప్రాజెక్ట్ 2027 డిసెంబర్ నాటికి పూర్తి చేయాలనే లక్ష్యం పెట్టుకున్నట్లు నిపుణుల కమిటీకి ఆయన వివరించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు పోలవరం ప్రాజెక్ట్ కు మొదటి ప్రాధాన్యత ఇస్తున్నారని, అందుకే ప్రమాణస్వీకారం చేసిన వెంటనే ప్రాజెక్ట్ ను సందర్శించారని గుర్తు చేశారు. రాష్ట్ర అభివృద్ధి పోలవరం ప్రాజెక్ట్ పైనే ఆధారపడి ఉందని నిపుణులకు వివరించారు. ఇంకా ఆయన ఏమన్నారో ఈ లింక్‌లో చూడండి.
బీజేపీ మహిళా నేతను అతి కిరాతంగా హత్య చేసిన భయానక ఘటన తమిళనాడు రాష్ట్రంలో చోటుచేసుకుంది. మధురై సెంట్రల్ నియోజకవర్గానికి చెందిన బీజేపీ నాయకురాలు శరణ్య సోమవారం రాత్రి ఇంటికి వెళ్తుండగా దుండగులు వెంటాడారు. వేట కొడవళ్లతో తల, మొండెంను వేరు చేసి అతి దారుణంగా అంతమొందించారు. దీంతో శరణ్య రక్తపు మడుగులో పడి అక్కడికక్కడే ప్రాణాలు విడిచారు. ఈ హత్యకు సంబంధించిన వివరాలు ఈ లింక్‌లో ఉన్నాయి. క్లిక్ చేసి పూర్తిగా తెలుసుకోండి.






