Skill University: తెలంగాణ స్కిల్ యూనివర్సిటీకి నిధులు ఇవ్వలేం.. కేంద్రం క్లారిటీ

by Prasad Jukanti |

తెలంగాణ స్కిల్ యూనివర్సిటీకి నిధులపై కేంద్ర ప్రభుత్వం క్లారిటీ ఇచ్చింది.

Skill University: తెలంగాణ స్కిల్ యూనివర్సిటీకి నిధులు ఇవ్వలేం.. కేంద్రం క్లారిటీ
X

దిశ, తెలంగాణ బ్యూరో/ డైనమిక్ బ్యూరో: తెలంగాణలో రేవంత్ రెడ్డి సర్కార్ ప్రతిష్టాత్మకంగా నెలకొల్పుతున్న యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ (Skill University) ఏర్పాటుకు నిధులు ఇవ్వలేమని కేంద్రం స్పష్టం చేసింది. ఇవాళ లోక్ సభలో ప్రశ్నోత్తరాల సమయంలో కాంగ్రెస్ ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి (MP Chamala Kiran Kumar Reddy) స్కిల్ యూనివర్సిటీ అంశాన్ని ప్రస్తావించారు. సీఎం రేవంత్ రెడ్డి విద్యార్థులకు నైపుణ్యాభివృద్ధి శిక్షణ అందించి ఉద్యోగావకాశాలు కల్పించాలనే లక్ష్యంతో యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్శిటీని హైదరాబాద్‌లో ప్రతిష్టాత్మకంగా నెలకొల్పుతున్నారు. దీని కోసం రాష్ట్రం రూ.100 కోట్లు కేటాయించింది. కార్పస్ ఫండ్‌ను సుమారు రూ. 300 నుంచి 500 కోట్లు ఏర్పాటు చేస్తున్నాం. ఈ యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్శిటీని గ్రాండ్ సక్సెస్ చేయడానికి, 2047 నాటికి 'అభివృద్ధి చెందిన దేశం' లక్ష్యాన్ని సాకారం చేసేందుకు తగిన నిధులు సమకూర్చాలని కేంద్ర ప్రభుత్వం నుండి ఏదైనా ప్రతిపాదన ఉందా? అని ప్రశ్నించారు. చామల కిరణ్ కుమార్ అడిగిన ప్రశ్నకు బదులిచ్చిన కేంద్ర మంత్రి జయంత్ చౌదరి (Jayant Chaudhary) .. స్కిల్ యూనివర్సిటీకి తాము నిధులు ఇవ్వలేమని చెప్పారు. రాష్ట్రాలు తమ చట్టాల ప్రకారం స్కిల్ వర్సిటీలు ఏర్పాటు చేశాయి. స్కిల్ యూనివర్సిటీ ఏర్పాటు చేసే కేంద్ర పథకమేదీ లేదన్నారు. అయితే ఇతర స్కీమ్ ల ద్వారా క్రెడిబిలిటీ కలిగిన సంస్థలకు సహకారం అందిస్తామని తెలిపారు.

Next Story