- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Good News: రైతులకు కేంద్రం మరో గుడ్ న్యూస్.. ఒకే రోజు రెండు పథకాలు ప్రారంభించిన నరేంద్ర మోడీ
ప్రధాన మంత్రి ధనధాన్య కృషి యోజన పథకానికి మోడీ శ్రీకారం చుట్టారు.

దిశ, డైనమిక్ బ్యూరో: రైతుల ముఖాల్లో ఆనందం చూడాలనేదే మా మొదటి ప్రాధాన్యత అని ప్రధాని నరేంద్ర మోడీ (Narendra Modi) అన్నారు. రైతులకు ఎదురవుతున్న సవాళ్ల పరిష్కారంలో నూతన ఆవిష్కరణలు వస్తున్నాయని రైతుల కోసం ఖర్చు చేయడంలో వెనుకాడేది లేదని స్పష్టం చేశారు. ఇవాళ న్యూఢిల్లీలోని భారత వ్యవసాయ పరిశోధనా సంస్థలో జరిగిన ప్రత్యేక కృషి కార్యక్రమంలో వ్యవసాయ ఉత్పాదకత పెంపు, నీటిపారుదల సౌకర్యాల మెరుగుదల, రైతులకు సులభతర రుణాల కల్పన కోసం ఎంపిక చేసిన 100 జిల్లాల్లో అమలు చేయనున్న ప్రధాన మంత్రి ధనధాన్య కృషి యోజన పథకం (PM Dhan Dhanaya Krishi Yojana), పప్పు ధాన్యాల ఉత్పత్తిలో స్వయం సమృద్ధి సాధించేలా పప్పు ధాన్యాల స్వయం-సమృద్ధి మిషన్ (Mission for Aatmanirbharta in Pulses) అనే రెండు పథకాలను ప్రారంభించారు. వ్యవసాయం, అనుబంధ రంగాల్లో మొత్తం రూ.42,000 కోట్లకుపైగా విలువైన రెండు పథకాలు, పలు ప్రాజెక్టులకు పీఎం శంకుస్థాపన చేశారు. ప్రధాన మంత్రి ధనధాన్య కృషి యోజన పథకానికి తెలంగాణ నుంచి నారాయణపేట, గద్వాల, జనగామ, నాగర్ కర్నూల్ జిల్లాలు, ఆంధ్రప్రదేశ్ నుంచి అల్లూరి సీతారామరాజు, అనంతపురం, అన్నమయ్య, శ్రీసత్యసాయి జిల్లాలు ఎంపికయ్యాయి.
గత ప్రభుత్వాలు రైతులను పట్టించుకోలేదు:
ఈ సందర్భంగా మాట్లాడిన ప్రధాని నరేంద్ర మోడీ.. రైతులు బాగుంటేనే దేశం సుభిక్షంగా ఉంటుందని గత ప్రభుత్వాలు రైతులను ఏనాడూ పట్టించుకోలేదని విమర్శించారు. వ్యవసాయం, రైతులకు దేశాభివృద్ధిలో ప్రదాన పాత్ర ఉందని పాల ఉత్పత్తిలో ప్రపంచంలో మనం ప్రథమ స్థానంలో ఉన్నామని చెప్పారు. ఎన్డీయే ప్రభుత్వం వచ్చాక రైతులపై ప్రత్యేక శ్రద్ధ పెట్టిందని రైతుల ప్రయోజనాల కోసం అనేక పథకాలు తీసుకొచ్చామని వెల్లడించారు. వ్యవసాయ రంగంలో నేడు 2 పథకాలు ప్రారంభించడం సంతోషంగా ఉందన్నారు. ఏ పథకం ప్రారంభించినా పేదలను దృష్టిలో పెట్టుకునే చేస్తున్నామన్నారు.






