కేంద్ర కులగణన ప్రకటన.. తెలంగాణ సర్కార్ విజయమే.. డిప్యూటీ సీఎం భట్టి

by Kema Shiva Kumar |   (  Updated:2025-05-03 08:43:58  IST  )

కేంద్రం కులగణన (Cast Census) ప్రకటన ముమ్మాటికీ తెలంగాణ సర్కార్ విజయమేనని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క (Mallu Bhatti Vikramarka) అన్నారు.

కేంద్ర కులగణన ప్రకటన.. తెలంగాణ సర్కార్ విజయమే.. డిప్యూటీ సీఎం భట్టి
X

దిశ, వెబ్‌డెస్క్: కేంద్రం కులగణన (Cast Census) ప్రకటన ముమ్మాటికీ తెలంగాణ సర్కార్ విజయమేనని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క (Mallu Bhatti Vikramarka) అన్నారు. ఇవాళ ఆయన ఖమ్మం (Khammam) జిల్లా ముదిగొండ మండల పరిధిలోని మల్లన్నపాలెం గ్రామంలోని రామలింగేశ్వర స్వామి దేవస్థానం పునర్నిర్మాణ అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. అనంతరం మీడియా మాట్లాడుతూ.. తెలంగాణ (Telangana)లో కులగణన చేసి దేశానికి రోల్ మోడల్‌గా నిలిచామని అన్నారు. ప్రభుత్వం నిర్ణయాల్లో కులగణనను పరిగణలోకి తీసుకుంటామని తెలిపారు. కులగణన సర్వే ఫలితాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని పార్టీ శ్రేణులకు పిలునిచ్చారు.

అదేవిధంగా ప్రభుత్వానికి బీసీలు ఎల్లప్పడూ అండగా ఉండాలని కోరారు. రాహుల్ గాంధీ (Rahul Gandhi) భారత్ జోడో యాత్ర (Bharat Jodo Yathra) సందర్భంగా సామాజిక అసమానతలు తొలగించడానికి దేశ వ్యాప్తంగా కుల‌గణన చేయాలని డిమాండ్ చేశారని గుర్తు చేశారు. కులగణన ఆధారంగా బీసీలకు రాజకీయ, విద్యా, ఉద్యోగాల్లో 42 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ అసెంబ్లీలో తీర్మాణం చేసి కేంద్రానికి పంపామని అన్నారు. కులగణన చేపట్టాలనే రాహుల్‌ గాంధీ డిమాండ్‌ చేస్తున్నా.. పట్టించుకోని కేంద్ర ప్రభుత్వం ఎట్టకేలకు ప్రజల ఒత్తిడికి తలొగ్గి అందుకు ఒప్పుకుందని తెలిపారు. రాష్ట్రంలో తాము నిర్వహించిన కులగణనను ఇన్నాళ్లు అపహాస్యం చేసిన బీజేపీ (BJP) ఇప్పుడు తమ దారిలోకి రావడం సంతోషకర పరిణామమని మల్లు భట్టి విక్రమార్క అన్నారు.

Next Story