రాజ్యసభలో బనకచర్లపై చర్చ.. కాంగ్రెస్ MP ప్రశ్నకు కేంద్రం సమాధానం ఇదే!

by Gantepaka Srikanth |

బనకచర్ల ప్రాజెక్టు(Banakacharla Project) అంశాన్ని కాంగ్రెస్ ఎంపీ అనిల్ కుమార్ యాదవ్(Anil Kumar Yadav) రాజ్యసభలో ప్రస్తావించారు.

రాజ్యసభలో బనకచర్లపై చర్చ.. కాంగ్రెస్ MP ప్రశ్నకు కేంద్రం సమాధానం ఇదే!
X

దిశ, వెబ్‌డెస్క్: బనకచర్ల ప్రాజెక్టు(Banakacharla Project) అంశాన్ని కాంగ్రెస్ ఎంపీ అనిల్ కుమార్ యాదవ్(Anil Kumar Yadav) రాజ్యసభలో ప్రస్తావించారు. ఈ ప్రాజెక్టుతో తెలంగాణకు చాలా అన్యాయం జరిగే అవకాశం ఉందని.. దీనిపై కేంద్రం సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. దీంతో కేంద్ర జల్‌శక్తి శాఖ స్పందించింది. రాజ్యసభలో లిఖితపూర్వక సమాధానం ఇచ్చింది. బనకచర్ల ప్రాజెక్టును ఇంకా చేపట్టలేదని.. తమకు ఏపీ ప్రభుత్వం చెప్పిందని.. ప్రిఫీజబిలిటీ రిపోర్టును సైతం ఏపీ తమకు అందజేసిందని కేంద్రం స్పష్టం చేసింది. వీటితో పాటు ఇప్పటికే తెలంగాణ సైతం బనకచర్లపై అభ్యంతరం చెబుతూ లేఖ రాసిందని అన్నారు. బనకచర్ల సాంకేతిక, ఆర్థిక అంచనా కోసం తగిన ప్రక్రియను అనుసరిస్తామని పేర్కొంది. ఈ ప్రాజెక్టుపై అధికారులు, పరివాహక రాష్ట్రాలతో చర్చిస్తామని హామీ ఇచ్చారు. ఈ మేరకు కేంద్ర సహాయ మంత్రి రాజ్‌భూషణ్ చౌదరి సమాధానాలు ఇచ్చారు. కాగా, ఇప్పటికే ఈ ప్రాజెక్టు విషయంలో రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు రేవంత్ రెడ్డి, చంద్రబాబు కలిసి చర్చించారు. ఎవరికీ అన్యాయం జరుగకుండా నిర్ణయం తీసుకోవాలని అభిప్రాయానికి వచ్చారు.

Next Story