కేంద్రం నిధులు- రాష్ట్రం ప్రచారం.. పార్లమెంట్​ నివేదికలో వెల్లడి

by Mahesh |
కేంద్రం నిధులు- రాష్ట్రం ప్రచారం.. పార్లమెంట్​ నివేదికలో వెల్లడి
X

దిశ, తెలంగాణ బ్యూరో : కరోనా కష్టాలు రావడంతో రాష్ట్రంలో సర్కార్ ఆస్పత్రుల అభివృద్ధికి కేంద్రం స్పెషల్​ఫండ్స్​ఇచ్చింది. కొత్త ఆస్పత్రుల నిర్మాణాలు, బెడ్ల సంఖ్యను పెంచేందుకు సామగ్రి, ఎక్విప్​మెంట్లు, పాత ఆస్పత్రుల రెనోవేషన్ కు భారీగా నిధులు ఖర్చు చేసింది. గత మూడేళ్లలో తెలంగాణకు రూ. 542 కోట్లు కేటాయించినట్లు కేంద్రం పార్లమెంట్ లో స్పష్టం చేసింది. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, కమ్యూనిటీ హెల్త్​సెంటర్లు, ఏరియా జిల్లా ఆస్పత్రుల తో పాటు మెడికల్​ కాలేజీలకు అనుబంధ హాస్పిటళ్ల అన్నింటినీ అభివృద్ధి చేసేందుకు నిధులు మంజూరు చేసినట్లు వెల్లడించింది.

రాష్ట్రం చొరవేనంటూ..

వైద్య కార్యక్రమాలన్నింటిలోనూ మెజార్టీ నిధులు తామే ఇస్తున్నామని కేంద్రం స్పష్టం చేసింది. నేషనల్ హెల్త్​మిషన్​స్కీమ్​ద్వారా స్టాఫ్, ఇన్​ఫ్రాస్ట్రక్చర్​డెవలప్​చేస్తూనే, దవాఖానల అభివృద్ధికు కూడా ప్రత్యేక నిధులు ఇస్తున్నట్లు వెల్లడించింది. భవిష్యత్‌లో మరింత డెవలప్ చేసేందుకు ఆయుష్మాన్​భారత్​ఇన్ స్ట్రక్చర్​మిషన్​పేరిట నిధులు ఖర్చు చేయనుంది. 2021–22 నుంచి 2025–26 వరకు దేశంలోని ప్రభుత్వ విభాగాల్లోని అన్ని దవాఖానలను అభివృద్ధికి ఏకంగా రూ. 64,180 కోట్ల బడ్జెట్​ను విడతల వారీగా కేటాయిస్తూ బలోపేతం చేస్తామని వివరించింది. అయితే అభివృద్ధి అంతా రాష్ట్ర ప్రభుత్వమే చేస్తున్నట్లు గొప్పలు పలుకుతున్నదని కేంద్రం విమర్శించింది.

గతంతో పోల్చితే ఆస్పత్రుల్లో కరోనా తర్వాత చాలా మార్పులు వచ్చాయి. ఇది రాష్ట్ర సర్కార్ చొరవతోనే చేశామంటూ మంత్రులు, ఎమ్మెల్యేలు ప్రచారం చేశారు. కానీ ఆస్పత్రుల అభివృద్ధికి కేంద్రం కూడా ఆర్థికసాయం చేసిందని పార్లమెంట్ నివేదికలో పొందుపరచడం గమనార్హం. పైగా హెల్త్ ప్రోగ్రామ్ లన్నింటిలోనూ కేంద్రానిదే మెజార్టీ బడ్జెట్ షేర్​ఉన్నట్లు స్వయంగా వైద్యాధికారులే ఆఫ్​ది రికార్డుగా చెబుతున్నారు.

తెలంగాణకు కేంద్రం ఇచ్చిన నిధులు

సంవత్సరం రూ. కోట్లలో

2019 –20 316

2020–21 212

2021–22 76.4

Read More....

వాట్ నెక్స్ట్! తెలంగాణలో హాట్ టాపిక్‌గా మారిన Kavitha

Next Story