- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
తెలంగాణ పంపిన BC బిల్లుపై కేంద్రం వివరణ
తెలంగాణ ప్రభుత్వం పంపిన బీసీ రిజర్వేషన్ల బిల్లుపై కేంద్రం వివరణ ఇచ్చింది.

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణ ప్రభుత్వం పంపిన బీసీ రిజర్వేషన్ల బిల్లు(BC Reservation Bill)పై కేంద్రం వివరణ ఇచ్చింది. మంగళవారం లోక్‌సభలో ఎంపీ ఈటల రాజేందర్(Etala Rajender) ప్రశ్నకు.. కేంద్ర సామాజిక, న్యాయవాద మంత్రి బీపీఎల్ శర్మ(Minister BPL Sharma) వివరణ ఇచ్చారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. తెలంగాణ ప్రభుత్వం పంపిన రెండు బిల్లులు రాష్ట్రపతి వద్దకు వచ్చాయి. బీసీ రిజర్వేషన్ల పెంపుపై శాసనసభ కార్యదర్శి నుంచి రెండు బిల్లులు వచ్చాయి. ఆ రెండు బిల్లులు పరిశీలన దశలో ఉన్నాయని స్పష్టం చేశారు. ఇదిలా ఉంటే.. రాష్ట్రపతి అపాయింట్‌మెంట్ రాకుండా మోడీ, అమిత్‌షా అడ్డుకున్నారని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీవ్ర ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. తెలంగాణ ప్రజలకు బీజేపీ ఎప్పుడూ అన్యాయం చేస్తూనే ఉందని విమర్శించారు. అంతేకాదు.. బీసీ రిజర్వేషన్ల బిల్లుకు ఆమోదం తెలపాలని ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద కాంగ్రెస్ నేతలు ఆందోళనలు కూడా చేశారు. ఈ ధర్నాల్లో స్వయంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రులు, కీలక నేతలు పాల్గొన్నారు.






