- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Urea Shortage: తెలంగాణ రైతాంగం పట్ల కేంద్రం వివక్ష: ప్రియాంక గాంధీ
కేంద్ర ప్రభుత్వం తెలంగాణ రైతాంగం పట్ల వివక్ష చూపిస్తుందని కాంగ్రెస్ ఎంపీ, ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ విమర్శించారు.

దిశ, తెలంగాణ బ్యూరో/ డైనమిక్ బ్యూరో: కేంద్ర ప్రభుత్వం తెలంగాణ రైతాంగం పట్ల వివక్ష చూపిస్తుందని కాంగ్రెస్ ఎంపీ, ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ (Priyanka Gandhi) విమర్శించారు. రాష్ట్రంలో యూరియా (Urea Shortage) సమస్యను పరిష్కరించాలని ఇవాళ పార్లమెంట్ ఆవరణంలో తెలంగాణ కాంగ్రెస్ ఎంపీల ఆందోళన చేపట్టారు. ఈ నిరసనకు ప్రియాంక గాంధీ మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఆమె తెలంగాణ రైతాంగం హక్కుల కోసం మా పోరాటం కొనసాగుతుందని చెప్పారు. జీరో అవర్ లో యూరియా సమస్య లేవనెత్తుతామన్నారు.
గట్టిగా నిలదీయండి:
యూరియా సమస్య పరిష్కారం కోసం ఢిల్లీలో సాగుతున్న ఆందోళన కార్యాచరణపై ఎంపీలతో వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మాట్లాడారు. యూరియా సరఫరా చేయకుండా కేంద్ర ప్రభుత్వం చూపిస్తున్న వివక్షపై గట్టిగా నిలదీయాలని ఎంపీలకు మంత్రి తుమ్మల సూచించారు. కాగా రాష్ట్రా రైతుల ఇబ్బందులను పరిష్కరించేందుకు తక్షణమే తెలంగాణకు 3 లక్షల టన్నుల యూరియా సరఫరా చేయాలని నిన్న కేంద్ర ఎరువులు, రసాయనాల శాఖ మంత్రి జేపీ నడ్డాకు కాంగ్రెస్ ఎంపీలు వినతిపత్రం సమర్పించారు. కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి చేసిన కేటాయింపులకు సరిపడా యూరియా సరఫరా చేయడం లేదని పేర్కొన్నారు.






