Breaking News : పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టుకు కేంద్రం షాక్

by Muthe.Rajitha |   (  Updated:2025-03-28 10:19:25  IST  )

పాలమూరు-రంగారెడ్డి(Palamuru-Rangareddy) ప్రాజెక్టుకు కేంద్ర ప్రభుత్వం షాకిచ్చింది.

Breaking News : పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టుకు కేంద్రం షాక్
X

దిశ, వెబ్ డెస్క్ : పాలమూరు-రంగారెడ్డి(Palamuru-Rangareddy) ప్రాజెక్టుకు కేంద్ర ప్రభుత్వం షాకిచ్చింది. మహబూబ్ నగర్ జిల్లాలోని పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని జాతీయ ప్రాజెక్టు(National Project)గా గుర్తించాలని రాష్ట్ర ప్రభుత్వం కేంద్రాన్ని కోరుతూ ప్రతిపాదనలు పంపింది. కాగా ఈ ప్రాజెక్టు ప్రతిపాదనలను కేంద్రం వెనక్కి పంపింది. కృష్ణా నదీజలాల(Krishna River Water) వినియోగంపై ఏపీ, తెలంగాణ రాష్ట్రాల మధ్య ప్రస్తుత వివాదం కోర్టులో ఉందనే కారణాన్ని ఎత్తి చూపుతూ తెలంగాణ అభ్యర్థనను నిరాకరించింది. కృష్ణా ట్రిబ్యునల్-2(Krishna Tribunal-2) ఇందుకు సంబంధించిన విచారణ చేపడుతోందని జలశక్తిశాఖ పేర్కొంది. కోర్టు వివాదం నేపథ్యంలో.. తెలంగాణ రాష్ట్రం పంపిన ప్రాజెక్ట్ టెక్నో ఎకనమిక్ రిపోర్టును పరిగణలోకి తీసుకోవడం సాధ్యం కాదని కేంద్ర జలశక్తిశాఖ తేల్చి చెప్పింది. దీంతో ఎంతోకాలంగా పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టుకు జాతీయ హోదా దక్కుతుందని ఎదురు చూసిన తెలంగాణకు మరోసారి నిరాశే ఎదురైంది.

Next Story