- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
రాష్ట్రంలో సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్
ఏఐ రంగంలో దేశంలోనే అగ్రగామిగా నిలవడానికి తెలంగాణ రాష్ట్రం కీలక ముందడుగు వేసింది.

దిశ, తెలంగాణ బ్యూరో: " ఏఐ రంగంలో దేశంలోనే అగ్రగామిగా నిలవడానికి తెలంగాణ రాష్ట్రం కీలక ముందడుగు వేసింది. ఐఐటీ మద్రాన్, కేంద్ర ఎలక్ట్రానిక్స్ అండ్ ఐటీ మంత్రిత్వ శాఖ (ఎంఈఐటీవై) సహకారంతో రాష్ట్రంలో ప్రతిష్టాత్మకమైన ఏఐ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఏర్పాటు చేయడానికి ప్రతిపాదనలు సిద్ధం చేసింది. ఈ ప్రాజెక్టుతో తెలంగాణ సాంకేతిక అభివృద్ధిలో కొత్త అధ్యాయానికి నాంది పలకనుంది. ఈ సెంటర్ ద్వారా విద్య, పరిశోధన, పరిశ్రమల మధ్య బలమైన బంధం ఏర్పడనుంది. హైదరాబాద్‌ను కేంద్రంగా చేసుకుని, వరంగల్, ఖమ్మం, సిద్దిపేట, నిజామాబాద్‌లోని ఐటీఐ కాలేజీలను ఈ ప్రాజెక్టుతో అనుసంధానం చేయనున్నారు. యువ తకు అత్యాధునిక ఏఐ నైపుణ్యాల్లో శిక్షణ అందించడమే లక్ష్యంగా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్నది. ఎమర్జింగ్ టెక్నాలజీస్ విభాగం సమర్పించిన ప్రాథమిక ప్రతిపాదనకు కొనసాగింపుగా, రాబోయే కొన్ని నెలల్లో ఈ ఏఐ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్‌ను స్థా పించే దిశగా ముందుకు సాగుతున్నారు. ఈ కేం ద్రం ద్వారా ఏఐ పరిశోధన, అభివృద్ధి, పరిశ్రమ తో భాగస్వామ్యం, ప్రభుత్వ సేవలకు ఏఐ ఆధారిత పరిష్కారాల రూపకల్పన, స్టార్టన్ ఎకో సిస్టంకు మ ద్దతు అన్నీ ఒకే వేదికపైకి తీసుకురానున్నారు. తెలంగాణను జాతీయ స్థాయిలో ఏఐ ఇన్నోవేషన్ కేంద్రం గా తీర్చిదిద్దడమే లక్ష్యంగా ప్రతిపాదనను సిద్ధం చేశారు.
రూ.500 కోట్లు కేంద్ర సాయం!
సాంకేతిక రంగంలో కృత్రిమ మేధ (ఏఐ)ది కీలక స్థానం. ఏఐ ప్రవేశంతో ఐటీ, ఐటీఈఎస్, బ్యాంకింగ్, హెల్త్‌కేర్ తదితర రంగాల్లో విప్లవాత్మకమైన మార్పులు చోటుచేసుకొంటున్నాయి. ఏఐతో ఉద్యోగాల కోత ఉందన్న విషయాన్ని పక్కనబెడితే, దాని ద్వారా చేకూరుతున్న ప్రయోజనాలు సైతం ఎక్కువే. ఏఐ రంగంలో ఇప్పటికే చాట్‌జీపీటీ, గ్రోక్, జెమినీ, డీప్‌సీక్ వంటి ప్లాట్‌ఫామ్‌లు మంచి ఆదరణను చూరగొన్నాయి. అంతర్జాతీయ దిగ్గజ కంపెనీలూ ఏఐ నైపుణ్యం కలిగిన మానవ వనరుల వైపే దృష్టి సారిస్తున్నాయి. ఈ క్రమంలో యువత నైపుణ్యాలను పెంచుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం కావాల్సిన మౌలిక సదుపాయాలను అందుబాటులోకి తీసుకువచ్చే దిశగా ముందుకు సాగుతున్నది. అందులో భాగంగానే ఏఐ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఏర్పాటు చేయడానికి నిర్ణయం తీసుకుంది. అయితే.. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొస్తున్న ఈ ప్రాజెక్టుకు కేంద్ర ప్రభుత్వం సుమారు రూ.500 కోట్ల నిధులు కేటాయించనుంది. ఈ నిధులతో పరిశోధన, డీవె టెక్ ఆవిష్కరణలు, సాధన, పరిశ్రమల అవసరాలకు అనుగుణమైన సాంకేతిక పరిష్కారాలను అభివృద్ధి చేయనున్నారు.
కీలక రంగాల్లో ఏఐ విస్తరణ
వ్యవసాయం, ఆరోగ్యం, విద్య, పట్టణ పాలన, ట్రాఫిక్ నిర్వహణ, సైబర్ భద్రత వంటి కీలక రంగాల్లో ఏఐ వినియోగాన్ని విస్తరించనున్నారు. ఇదే సమయంలో రాష్ట్రంలో ప్రత్యేకంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ హబ్ (ఏఐ హబ్)ను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ హబ్ 2026 జనవరి నాటికి ప్రారంభించేందుకు కార్యాచరణ ప్రణాళిక సిద్ధమవుతున్నది. ఈ హబ్ ద్వారా దేశీయ, అంతర్జాతీయ సంస్థలను ఆకర్శించి, తెలంగాణను ఏఐ, డీవ్ టెక్ రంగాల్లో, జాతీయ-అంతర్జాతీయ కేంద్రంగా అభివృద్ధి చేయాలనే లక్ష్యంతో ప్రభుత్వం ముందుకెళ్తున్నది. తెలంగాణలో ప్రతిపాదిత తెలంగాణ ఏఐ హబ్ (తెలంగాణ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ హబ్)ను రాబోయే 2-3 నెలల్లో అధికారికంగా ప్రారంభించనున్నారు. ఈ హబ్ ద్వారా ఏఐ స్టార్టప్‌నకు మెంటార్షివ్ అండ్ ఇంక్యుబేషన్, విద్యార్థులు, పరిశోధకులకు ప్రాజెక్ట్ అవకాశాలు, పరిశ్రమలతో ప్రత్యక్ష అనుసంధానం, ఏఐ వాణిజ్యకరణ వంటి అంశాలకు ఊతమివ్వనున్నారు.
యువతకు భారీగా ఉద్యోగ అవకాశాలు..
ప్రభుత్వం తీసుకొస్తున్న ఈ కొత్త ప్రాజెక్టుల ద్వారా రాష్ట్ర యువతకు భారీగా ఉద్యోగావకాశాలు ఏర్పడనున్నాయి. స్టార్టప్ ఎకో సిస్టమ్ మరింత బలోపేతం కావడంతోపాటు పరిశ్రమలకు అవసరమైన నైపుణ్యాలున్న మానవ వనరులు తెలంగాణ నుంచే సిద్ధమవుతాయి. ఐఐటీ మద్రాస్ అకడమిక్ నైపుణ్యం, కేంద్ర ప్రభుత్వ ఆర్థిక మద్దతు, రాష్ట్ర ప్రభుత్వ దూరదృష్టి ఈ మూడు కలిసి తెలంగాణ భవిష్యత్ టెక్నాలజీ రేపురేఖలు మారబోతున్నాయని ఐటీ రంగ నిపుణులు చెబుతున్నారు. మొత్తంగా ఏఐ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్, తెలంగాణ ఏఐ హబ్‌తో రాష్ట్రం కేవలం ఐటీ హబ్‌గానే కాకుండా, ఏఐ వవర్ హౌజ్ అవతరించే దిశగా అడుగులు వేస్తున్నది.
త్వరలోనే ప్రాంతీయ ఏఐ సమ్మిట్..
ఇప్పటికే ఫ్యూచర్ సిటీ వేదికగా రాష్ట్ర ప్రభుత్వం గ్లోబల్ సమ్మిట్ ను అట్టహాసంగా నిర్వహించింది. ఈ సమ్మిట్ కు అంతర్జా తీయ స్థాయిలో కంపెనీలు తరలివచ్చాయి. మొత్తంగా రూ.5. 75 లక్షల కోట్ల ఎంఓయూ జరిగినట్లు ప్రభుత్వం ప్రకటించిం ది. అయితే.. దీనికి కొనసాగింపుగా 2026 ఫిబ్రవరిలో నిర్వహించనున్న ఇండియా ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్‌కు ముందస్తు కార్యక్రమంగా భారత ప్రభుత్వ ఎలక్ట్రానిక్స్ సమాచార సాంకేతిక మంత్రిత్వ శాఖ (ఎంఈఐటీవై), తెలంగాణ ప్రభుత్వ ఐటీ అండ్ ఈ-గవర్నెన్స్ శాఖతో కలిసి హైదరాబాద్‌లో ప్రాంతీయ ఏఐ సమ్మిట్ నిర్వహించాలని ప్రతిపాదించింది. ఈ సమ్మిట్ ద్వారా దేశవ్యాప్తంగా ఏఐ రంగంలో జరుగుతున్న పరిశోధనలు, విధానాలు, పరిశ్రమల భాగస్వామ్యాన్ని ఒకే వేదికపైకి తీసుకు వచ్చి, 2026లో జరిగే జాతీయ స్థాయి ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్ ఫౌండేషన్ వేయబోతున్నారు.
ఏఐ బలోపేతం చేయాలనే లక్ష్యంతో..
విద్యార్థుల్లో ఏఐ మేధస్సు నైపుణ్యాలను బలోపేతం చేయాలనే లక్ష్యంతో భారత ప్రభుత్వం సైతం ముందుకు సాగుతున్నది. ఇండియా ఏఐ మిషన్‌లో భాగంగా దేశవ్యాప్తంగా ఎంపిక చేసిన విద్యాసంస్థల్లో ఏఐ డేలా ల్యాబ్స్ ఏర్పాటు చేయడానికి నిర్ణయం తీసుకుంది. ఈ కార్యక్రమం కింద రాష్ట్రంలోని ఐదు ఐటీఐ కాలేజ్ ఏఐ డేలా ల్యాబ్స్ ఏర్పాటుకు ఎంపికయ్యాయి. వాటిలో ప్రధానంగా ఐటీఐ మల్లెపల్లి, హైదరాబాద్, ఐటీఐ కుకునూర్‌పల్లి, ఐటీఐ పెద్దపల్లి, ఐటీఐ సంగారెడ్డి, ఐటీఐ సిద్దిపేట ఎంపికయ్యాయి. అయితే.. వీటిలో ప్రతి ఐటీఐ కాలేజీకి రూ.69 లక్షల చొప్పున నిధులను ఇండియా ఏఐ మిషన్ మంజూరు చేసింది. ఈ నిధులను ఆధునిక పరికరాల కొనుగోలు, ల్యాబ్ చూలిక వసకుల ఏర్పాటు, విద్యార్థులకు శిక్షణ దుగ్గకు, మిషన్ మార్గదర్శకాల ప్రకారం అమలు కార్యక్రమాలు కోసం వినియోగించనున్నారు. ఇలా ఐదు ఐటీఐలకు రూ.3.45 కోట్ల నిధులను మంజూరు చేసింది. దీని ద్వారా గ్రామీణ, పట్టణ ఐటీఐ విద్యార్థులకు ఆధునిక ఏఐ నైపుణ్యాలు అందుబాటులోకి రానున్నాయి.
- Tags
- AI






