- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Minister Sridhar Babu : మెట్రో ఫేజ్-2కు కేంద్రం మొండిచేయి : మంత్రి శ్రీధర్ బాబు
తెలంగాణ ఐటీ, శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి దుద్దిళ్ళ శ్రీధర్ బాబు(Minister Sridhar Babu) కేంద్ర కేబినెట్ నిర్ణయాల(Central Cabinet Decisions)పై అసంతృప్తి వ్యక్తం చేశారు.

దిశ, వెబ్ డెస్క్ : తెలంగాణ ఐటీ, శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి దుద్దిళ్ళ శ్రీధర్ బాబు(Minister Sridhar Babu) కేంద్ర కేబినెట్ నిర్ణయాల(Central Cabinet Decisions)పై అసంతృప్తి వ్యక్తం చేశారు. నేడు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ(PM Narendra Modi) అధ్యక్షతన జరిగిన కేంద్ర కేబినెట్లో హైదరాబాద్ మెట్రో రైల్ ఫేజ్-2 ప్రాజెక్టుకు(Hyderabad Metro Rail Phase-2 Project) గ్రీన్ సిగ్నల్ వస్తుందని ఆశించామని, ఈ విషయంలో మరోసారి రాష్ట్రానికి మొండిచేయి ఎదురైందని ఆవేదన వ్యక్తం చేశారు.
హైదరాబాద్‌లో ప్రజా రవాణా వ్యవస్థను బలోపేతం చేసేందుకు మెట్రో ఫేజ్-2 (ఫేజ్ II-ఎ, II-బి) కీలకమని, దీనిపై కేంద్రం వెంటనే నిర్ణయం తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఫేజ్ II-ఎ కింద 76.4 కిలోమీటర్ల మేర 5 కారిడార్లను రూ.24,269 కోట్లతో నిర్మించేందుకు ప్రతిపాదనలు పంపినట్లు తెలిపారు. ఫేజ్ II-బి కింద జేబీఎస్ నుంచి మేడ్చల్, శామీర్‌పేట్ మార్గాలకు జాయింట్ వెంచర్‌గా, జైకా, ఏడీబీ నిధులతో, పీపీపీ పద్ధతిలో నిర్మాణం చేపట్టాలని రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందని వెల్లడించారు.
సీఎం రేవంత్ రెడ్డి జూన్ 19న కేంద్ర మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్‌తో భేటీలో ఈ అంశాన్ని ప్రస్తావించినప్పటికీ, కేంద్ర కేబినెట్ సమావేశంలో ఈ ప్రాజెక్టుపై నిర్ణయం లేకపోవడం రాష్ట్ర ప్రజలను నిరాశపరిచిందని శ్రీధర్ బాబు విమర్శించారు. దేశ జీడీపీలో తెలంగాణ కీలక పాత్ర పోషిస్తోందని తెలిపిన మంత్రి శ్రీధర్ బాబు.. హైదరాబాద్ వంటి అభివృద్ధి చెందిన నగరం దేశ ఆర్థిక వృద్ధికి దోహదపడుతుందని, అటువంటి నగరంలో మెట్రో విస్తరణ జాతీయ ఆర్థిక ప్రాధాన్యత కలిగిన అంశమని, కేంద్రం ఈ ప్రాజెక్టుకు ప్రాధాన్యత ఇవ్వాలని కోరారు.






