- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
హైదరాబాద్ మెట్రో రెండో దశకు కేంద్రం గ్రీన్ సిగ్నల్
హైదరాబాద్ మెట్రో సెకండ్ ఫేజ్‌కు కేంద్రం సూత్రప్రాయ అంగీకారం తెలిపింది. కేంద్ర, రాష్ట్రాల 50:50 భాగస్వామ్యంతో ఈ ప్రాజెక్టు సాగించేందుకు సిద్దంగా ఉన్నట్లు కేంద్ర మంత్రి ఖట్టర్ తో భేటీ సందర్భంగా కిషన్ రెడ్డి తెలిపారు.

దిశ, డైనమిక్ బ్యూరో: హైదరాబాద్ ప్రజా రవాణా వ్యవస్థలో మరో మైలురాయిగా భావిస్తున్న మెట్రో సెకండ్ ఫేజ్ విషయంలో కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. హైదరాబాద్ మెట్రో రెండో దశకు కేంద్రం సూత్రప్రాయంగా అంగీకారం తెలిపింది. ఇవాళ కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్‍తో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి భేటీ అయ్యారు. ఢిల్లీలో జరిగిన ఈ సమావేశం సందర్భంగా హైదరాబాద్‍లో కొనసాగుతున్న వివిధ కీలక ప్రాజెక్టులపై సమీక్ష నిర్వహించారు. నగరంలో మౌలిక వసతులు, పారిశుద్ధ్యం, ప్రజారవాణాపై చర్చించినట్లు కిషన్ రెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా హైదరాబాద్ మెట్రో రెండో దశ ప్రాజెక్టుపై చర్చ జరిగిందని మెట్రో సెకండ్ ఫేజ్ కు కేంద్ర మంత్రి సూత్రప్రాయంగా అంగీకరించారని, డీపీఆర్ అందిన తర్వాత నిర్ణయం తీసుకుంటామని ఖట్టర్ చెప్పారని కిషన్ రెడ్డి తెలిపారు. కేంద్ర, రాష్ట్రాలు చెరో సగం ఖర్చుతో ముందుకెళ్లేందుకు సిద్ధంగా ఉన్నట్లు స్పష్టం చేశారు. 162 కి.మీ మెట్రో రెండో దశ విస్తరణకు రాష్ట్రం నుంచి ప్రతిపాదనలు వచ్చాయని వీటిని కేంద్రం పరిశీలించి తదుపరి చర్యలు చేపడుతుందని ఖట్టర్ చెప్పారు. కాగా తెలంగాణ ప్రభుత్వం ఎల్ అండ్ టీ (L&T) సంస్థ నుంచి మొదటి దశ మెట్రోను టేకోవర్ చేసిన సంగతి తెలిసిందే.






