VIDEO: ఖమ్మంలో సెల్ ఫోన్ దొంగల హల్ చల్.. పది నిమిషాల్లో పది ఫోన్లు మాయం

by Ajay Maddhiboyina |

ఖ‌మ్మం పాత బ‌స్టాండ్‌లో సెల్ ఫోన్ దొంగలు హల్ చల్ చేశారు. శుక్రవారం రాత్రి బస్టాండ్‌లో కేవలం పది నిమిషాల్లోనే పది ఫోన్లు కొట్టేశారు.

VIDEO: ఖమ్మంలో సెల్ ఫోన్ దొంగల హల్ చల్.. పది నిమిషాల్లో పది ఫోన్లు మాయం
X

దిశ, వెబ్ డెస్క్: ఖ‌మ్మం పాత బ‌స్టాండ్‌లో సెల్ ఫోన్ దొంగలు హల్ చల్ చేశారు. శుక్రవారం రాత్రి బస్టాండ్‌లో కేవలం పది నిమిషాల్లోనే పది ఫోన్లు కొట్టేశారు. ప్రయాణికులు బస్సు ఎక్కుతున్న సమయంలో కేటుగాళ్లు చోరీకి పాల్పడ్డారు. ఒక గ్యాంగ్ లా వచ్చి సెల్ ఫోన్లను దొంగలించుకుని పోయారు. చేతుల్లో కవర్లు పట్టుకుని వచ్చి ఒకరు ఫోన్ కొట్టేస్తే మరొకరు దానిని జాగ్రత్తగా అక్కడ నుండి మాయం చేశారు. అలా ఒకేసారి పది ఫోన్లను కొట్టేయడం షాకింగ్ గా మారింది. బస్సు ఎక్కిన తరవాత ప్రయాణికులు బేబులు చూసుకోగా ఫోన్లు మాయం అవ్వడంతో ఆశ్యర్యపోయారు. బాధితులు పోలీసులను ఆశ్రయించగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో వైరల్ అవ్వడంతో దొంగలు చాకచక్యంగా ఫోన్లను కొట్టేసిన తీరు అందర్నీ ఆశ్చర్యపరుస్తోంది.

Next Story