సీఎం రేవంత్​ రెండేళ్ల పాలనపై గాంధీభవన్​లో సంబరాలు

by Ramesh Naini |

రాష్ట్ర ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి రెండు సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా గాంధీ భవన్ లో ఫిషరీస్ ​కార్పొరేషన్​ చైర్మన్​ మెట్టు సాయి కుమార్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ ​కార్యకర్తలు సంబురాలు చేసుకున్నారు.

సీఎం రేవంత్​ రెండేళ్ల పాలనపై గాంధీభవన్​లో సంబరాలు
X

దిశ, తెలంగాణ బ్యూరో : రాష్ట్ర ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి రెండు సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా గాంధీ భవన్ లో ఫిషరీస్ ​కార్పొరేషన్​ చైర్మన్​ మెట్టు సాయి కుమార్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ ​కార్యకర్తలు సంబురాలు చేసుకున్నారు. మిఠాయిలు పంచుకుని ఒకరికొకరు శుభాకాంక్షలు తెలిపారు. పదేళ్ల గడీల పాలనను అంతం చేసి ఇందిరమ్మ రాజ్యం రేవంత్​ తీసుకొస్తున్నాడని ప్రశంసలు కురిపించారు.

కాంగ్రెస్​తోనే తెలంగాణ అన్ని విధాలుగా అభివృద్ధి చెందుతుందని పార్టీ సీనియర్లు ధీమా వ్యక్తం చేశారు. ఎన్నికల ముందు ప్రకటించిన ఆరు గ్యారెంటీలు అమలు చేయడంతో పాటు మరి కొన్ని సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నట్లు పేర్కొన్నారు. ప్రస్తుతం జరిగే స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్​ బలపరిచిన అభ్యర్థులు ప్రజలు గెలిపించాలని కోరారు.

Next Story