మూడో డిస్కం ఏర్పాటును విరమించుకోండి.. సీఎంకు CPI(M) రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ లేఖ

by Kema Shiva Kumar |

తెలంగాణలో మూడో డిస్కం ఏర్పాటు నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ డిమాండ్ చేశారు.

మూడో డిస్కం ఏర్పాటును విరమించుకోండి.. సీఎంకు CPI(M) రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ లేఖ
X

దిశ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ రాష్ట్ర విద్యుత్ రంగంలో ప్రభుత్వం తీసుకొచ్చిన మూడో డిస్కం ఏర్పాటుపై సీపీఐ(ఎం) అభ్యంతరం వ్యక్తం చేసింది. ఈ మేరకు ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ సీఎం రేవంత్ రెడ్డికి లేఖ రాశారు. ఈ విధానం వల్ల విద్యుత్ వినియోగదారులపై అదనపు భారం పడటంతో పాటు, విద్యుత్ రంగం ప్రైవేటీకరణకు దారితీస్తుందని ఆయన లేఖలో పేర్కొన్నారు. డిసెంబర్ 2025లో జీవో నెం.44 ద్వారా ఏర్పాటు చేసిన మూడో డిస్కంకు ఎలాంటి ఆదాయ వనరులు లేవన్నారు. దీని నిర్వహణకు ప్రభుత్వమే నిధులు కేటాయించాల్సి వస్తుందని తెలిపారు. ఇది ప్రజలపై ఆర్థిక భారాన్ని పెంచే చర్య అని లేఖలో పేర్కొన్నారు.

విద్యుత్ రెగ్యులేటరీ కమిషన్ నిర్వహించిన ప్రజా విచారణలో వినియోగదారులు, రైతు సంఘాలు, విద్యుత్ నిపుణులు ఈ డిస్కం ఏర్పాటును వ్యతిరేకించారని గుర్తు చేశారు. కేంద్ర ప్రభుత్వం తెచ్చిన విద్యుత్ చట్ట సవరణల అమలులో భాగంగానే ఈ డిస్కంను తీసుకొచ్చారని, భవిష్యత్తులో విద్యుత్ రంగాన్ని ప్రైవేటు, కార్పొరేటు శక్తులకు అప్పగించే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో విద్యుత్ కొరత లేనప్పుడు కొత్త ప్రయోగాలు ఎందుకని ప్రశ్నించారు. మూడో డిస్కాంను వెంటనే ఉపసంహరించుకోవాలని, విద్యుత్ నిర్వహణ బాధ్యతలను ప్రభుత్వమే సమర్థంగా కొనసాగించాలని జాన్ వెస్లీ కోరారు.

Next Story