ఏడు విడతల్లో కాంట్రాక్టర్లకు శిక్షణ.. ఇస్కీ ట్రైనింగ్‌లో సీడీఎంఏ రీజినల్ డైరెక్టర్ ఆర్.శ్రీనివాస్ రావు

by Ajay Maddhiboyina |

తెలంగాణలో కాంట్రాక్టర్లకు శిక్షణ ఇవ్వడం మొదటి సారని, ఏడు విడతల్లో ట్రైనింగ్ నిర్వహించనున్నామని సీడీఎంఏ రీజినల్ డైరెక్టర్ ఆర్. శ్రీనివాస రావు అన్నారు.

ఏడు విడతల్లో కాంట్రాక్టర్లకు శిక్షణ.. ఇస్కీ ట్రైనింగ్‌లో సీడీఎంఏ రీజినల్ డైరెక్టర్ ఆర్.శ్రీనివాస్ రావు
X

దిశ, తెలంగాణ బ్యూరో: తెలంగాణలో కాంట్రాక్టర్లకు శిక్షణ ఇవ్వడం మొదటి సారని, ఏడు విడతల్లో ట్రైనింగ్ నిర్వహించనున్నామని సీడీఎంఏ రీజినల్ డైరెక్టర్ ఆర్. శ్రీనివాస రావు అన్నారు. తెలంగాణ అర్బన్ లోకల్ బాడీస్ లో పనిచేస్తున్న సివిల్ కాంట్రాక్టర్లకు రెండు రోజుల రెండో బ్యాచ్ శిక్షణా కార్యక్రమం గచ్చిబౌలిలోని ఇంజనీరింగ్ స్టాఫ్ కాలేజీ ఆఫ్ ఇండియా(ఇస్కీ)లో గురువారం ప్రారంభమైంది. ఈ సందర్బంగా శ్రీనినవాస్ రావు మాట్లాడుతూ సిద్ధిపేట, లక్సెట్టిపేట, జగిత్యాల, కోరుట్ల, ములుగు, అశ్వారావు పేట, మంచిర్యాల, మంథని తదితర మున్సిపాలిటీలలో పనిచేస్తున్న సివిల్ కాంట్రాక్టర్లు హాజరయ్యారని తెలిపారు. కాంట్రాక్టర్లు చేబట్టే అనేక సివిల్ వర్క్స్ నిర్మాణాల్లో అనుసరించాల్సిన విధానాలు, జాగ్రత్తలు, ప్లానింగ్, ఎగ్జిక్యూషన్, డాక్యుమెంటేషన్ వాటిపై సీనియర్ అధికారులు శిక్షణ ఇచ్చారని వివరించారు. కాంట్రాక్టర్లకు శిక్షణ ఇవ్వడం తెలంగాణాలో ఇది మొదటిసారని, రాష్ట్రంలోని సుమారు 276 మంది కాంట్రాక్టర్లకు ఏడు విడతల్లో ఈ శిక్షణా కార్యక్రమానులుంటాయని తెలిపారు.

టీయూఎఫ్ఐడీసీ సూపరింటెండెంట్ ఇంజనీర్ విశ్వనాధ్ రాజు మాట్లాడుతూ రాబోయే ఐదారేళ్ళలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ నిధులతో నగరాభివృద్ధి కింద వివిధ మున్సిపాలిటీలు, కార్పొరేషన్స్ లో వందల కోట్లతో ప్రజల సౌకర్యం కోసం అనేక సివిల్ వర్క్స్ చేసే అవకాశం ఉందని అన్నారు. అమృత్, స్వచ్ఛ భారత్ మిషన్, అర్బన్ ఛాలెంజింగ్ తదితర నిధులతో కూడా అనేక నూతన ప్రాజక్టులు వచ్చే అవకాశం ఉందని, ఈ నిర్మాణాల బాధ్యతలన్నీ కూడా మున్సిపాలిటీ కాంట్రాక్టర్లపై ఉందని, ఇందుకోసం ప్రతీ పనిలో క్వాలిటీ స్టాండర్డ్స్ పెంచుకోవడంతో పాటుగా, పని జరిగే ప్రదేశాల్లో కార్మికుల రక్షణ చర్యలు చేపట్టాల్సిన అవసరం ఉందని అన్నారు. కెపాసిటీ బిల్డింగ్ ప్రతి వృత్తికి అవసరమైన టూల్ కిట్ అని జాయింట్ డైరెక్టర్ బి. సంధ్య అన్నారు.

టెక్నాలజీ అనూహ్యంగా విస్తరిస్తున్న దశలో ఇంజనీరింగ్ పనులు కూడా ఒక సవాలుగా మారాయని, విశ్వంలోని ప్రతిచోటా ఇంజనీరింగ్ అద్భుతాలు కనబడుతున్నాయని, మున్సిపల్ ఏరియాల్లో పనిచేసే కాంట్రాక్టర్లు కూడా వినూత్నమైన ఆలోచనలతో ప్రజలకు శాశ్వతంగా ఉపయోగపడే అనేక పనులు చేపట్టవచ్చని సంధ్య అన్నారు. ఇస్కీ డైరెక్టర్ డాక్టర్ జి.రామేశ్వర్ రావు మాట్లాడుతూ పబ్లిక్ వర్క్స్ చేస్తున్నపుడు క్వాలిటీతో పాటుగా బెస్ట్ ప్రాక్టీసెస్, మోడరన్ టెక్నాలజీ లను స్టడీ చేసి పనులు చేపట్టాలని కాంట్రాక్టర్లకు సూచించారు. ఈ సమావేశంలో రిటైర్డ్ ఈఎన్సీ జియావుద్దీన్, సీనియర్ ఇంజినీర్లు వెంకట్గేశ్వర్లు, అనితా అగర్వాల్, వి. మోహన్ కుమార్, అనిల్ కుమార్ నాగమల్లేశ్వర రావ్, ప్రకాష్ తదితరులు పాల్గొన్నారు. శిక్షణలో భాగంగా దుర్గం చెరువుతో పాటుగా సిద్ధిపేట మున్సిపాలిటీలోని అమృత్ పార్క్, సీవరేజ్ ట్రీట్ మెంట్ ప్లాంట్, ఎలివేటెడ్ లెవల్ సర్వీస్ రిజర్వాయర్ జరిగిన పనుల తీరును కాంట్రాక్టర్లు పరిశీలించనున్నారు.

Next Story