సైబర్ ఎటాక్ జరిగిందని వెళ్తే లేడీ యాంకర్‍పై సీసీఎస్ పోలీసుల దౌర్జన్యం!

by Prasad Jukanti |

సైబర్ దాడి జరిగిందని ఫిర్యాదు చేయడానికి వెళ్తే పోలీసులు దౌర్జన్యంగా వ్యవహరించారని మహిళా యాంకర్ ఆరోపించడం కలకలం రేపుతోంది.

సైబర్ ఎటాక్ జరిగిందని వెళ్తే లేడీ యాంకర్‍పై సీసీఎస్ పోలీసుల దౌర్జన్యం!
X

దిశ, డైనమిక్ బ్యూరో: సైబర్ నేరగాళ్లు తన ఫోన్ ను హ్యాక్ చేసి డబ్బులు వసూలు చేస్తున్నారని ఫిర్యాదు చేయడానికి వెళ్తే సైబర్ క్రైమ్ పోలీసులు పట్టించుకోకపోవడమే కాకుండా దౌర్జన్యం చేస్తున్నారని ఓ మహిళా యాంకర్ సంచలన ఆరోపణలు చేశారు. ఫిర్యాదు చేయడనానికి వెళ్లిన తనపై పోలీసులు జులం ప్రదర్శించారని ఆరోపించారు. ఇవాళ తెలంగాణలో సైబర్ నేరగాళ్ళు ముప్పేట దాడి (Cyber ​​Attack) చేశారు. ఏకంగా రాష్ట్ర కేబినెట్ మంత్రుల వాట్సాప్ మీడియా గ్రూప్‍లను హ్యాక్ చేసి ఎస్ బీఐ కేవైసీ పేరుతో ఏపీకే పైల్స్ పంపిస్తున్నారు. ఈ క్రమంలో ఓ న్యూస్ చానల్‍లో పని చేస్తున్న లేడీ యాంకర్ ఫోన్ సైతం సైబర్ నేరగాళ్లు హ్యాక్ (Phone Hack) చేసి అర్జంట్‍గా డబ్బులు కావాలని ఆమె ఫోన్ లో ఉన్న కాంటాక్ట్ నంబర్లలో మెసేజులు పంపించారు. ఇది నిజమే అని నమ్మిన ఆమె బంధువులు, స్నేహితులు హుటాహుటీనా డబ్బులు పంపించగా వాటిని సైబర్ నేరగాళ్లు కాజేశారు. ఇలా దాదాపు ఐదు లక్షల రూపాయల వరకు సైబర్ నేరగాళ్లు కాజేసినట్లు బాధితురాలు ఆరోపించారు.

అయితే ఈ విషయంలో ఫిర్యాదు చేసేందుకు ఇవాళ సైబర్ క్రైమ్ పోలీసులను (CCS Police) ఆశ్రయించారు. తన ఫిర్యాదును పోలీసులు తీసుకోకపోగా ఆదివారం స్టాఫ్ ఎవరూ ఉండరని తర్వాత రమ్మని ఉచిత సలహాలు ఇస్తున్నారని ఆరోపించారు. హ్యాక్ కామన్.. డబ్బులు పోతే మేమేం చేస్తాం. అసలు బాధితులు మీరు కాదని అసలైన బాధితులు ఫిర్యాదు చేస్తేనే కంప్లయింట్ తీసుకుంటామని చెప్పినట్లు ఆరోపించారు. అయితే ఫిర్యాదు చేయడానికి వస్తే పట్టించుకోకపోవడంతో ఈ విషయాన్ని సదరు యాంకర్ ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళ్తున్న క్రమంలో తమపైనే ఫిర్యాదు చేస్తావా దౌర్జన్యంగా వ్యవహరించారని బాధితురాలు ఆరోపించారు. సీసీఎస్ పోలీసులను ఆశ్రయించడానికి ముందే తాను తెలంగాణ సైబర్ హెల్ప్ లైన్ నంబర్ 1930 కు ఫోన్ చేస్తే అక్కడ కనీసం స్పందించడం లేదని స్పందించినా వెయిటింగ్‍లో ఉంచుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. మహిళా జర్నలిస్టు విషయంలో పోలీసులు ఇలా వ్యవహరిస్తే ఇక సామాన్యుల పరిస్థితి ఏంటని ప్రశ్నిస్తున్నారు. మరి ఈ వ్యవహారంపై పోలీసులు ఎలా స్పందిస్తారో చూడాలి మరి.

Next Story