- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
కాళేశ్వరం కేసులో BIG అప్డేట్.. సీబీఐ విచారణకు లైన్ క్లియర్
కాళేశ్వరం కేసు(Kaleshwaram Case)లో కీలక పరిణామం చోటుచేసుకుంది.

దిశ, వెబ్‌డెస్క్: కాళేశ్వరం కేసు(Kaleshwaram Case)లో కీలక పరిణామం చోటుచేసుకుంది. కాళేశ్వరంపై సీబీఐ(CBI) విచారణకు లైన్ క్లియర్ అయింది. కాళేశ్వరం అవకతవకలపై సీబీఐ చేసే విచారణకు తాము పూర్తిగా సహకరిస్తామని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. ఈ మేరకు మంగళవారం జీవో విడుదల చేసింది. తెలంగాణలో సీబీఐకి ఎంట్రీ లేకుండా 2022లో గత ప్రభుత్వం చేసిన విషయం తెలిసిందే. తాజాగా ఆ ఆంక్షల నుంచి ప్రస్తుత ప్రభుత్వం మినహాయింపు ఇస్తున్నట్లు జీవోలో పేర్కొన్నది. కాగా, రాష్ట్రంలో సీబీఐ విచారణకు ఎలాంటి అడ్డంకులు లేవని ఇప్పటికే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) స్పష్టం చేశారు. జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ నివేదిక ఆధారంగా పారదర్శక విచారణ కోసం సీబీఐకి కేసు అప్పగించామని సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు. కేంద్ర, రాష్ట్రాలకు చెందిన పలుశాఖల ప్రమేయంపై, అంతర్రాష్ట్ర అంశాల పైనా దర్యాప్తు చేయాలని సీబీఐని ప్రభుత్వం కోరింది. అంతేకాదు.. కాళేశ్వరం ఇరిగేషన్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ పైనా దర్యాప్తు చేయాలని హోంశాఖకు పంపిన లేఖలో పేర్కొంది.






