కాళేశ్వరం‌పై సీబీఐ ఎంక్వైరీ.. కేంద్ర హోంశాఖకు సర్కార్ లేఖ!

by Kema Shiva Kumar |   (  Updated:2025-09-01 07:54:22  IST  )

కాళేశ్వరం (Kaleshwaram)పై జస్టిస్ చంద్రఘోష్ (Justice Chandraghosh) ఇచ్చిన నివేదికను ప్రభుత్వం శాసననభలో ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే.

కాళేశ్వరం‌పై సీబీఐ ఎంక్వైరీ.. కేంద్ర హోంశాఖకు సర్కార్ లేఖ!
X

దిశ, డైనమిక్ బ్యూరో: కాళేశ్వరం (Kaleshwaram)పై జస్టిస్ చంద్రఘోష్ (Justice Chandraghosh) ఇచ్చిన నివేదికను ప్రభుత్వం శాసననభలో ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే. ఇప్పటికే ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్‌ (BRS)తో సహా అన్ని పార్టీల సభ్యులు ఆ నివేదికపై తమ అభిప్రాయాలను సభలో జరిగిన సుధీర్ఘ చర్చలో పంచుకున్నారు. ఈ మేరకు కాళేశ్వరం‌పై విచారణకు సీబీఐ (CBI)కి అప్పగించాలని నిర్ణయించామని సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) అసెంబ్లీలో ఆదివారం రాత్రి ప్రకటించారు.

ఈ క్రమంలోనే కీలక పరిణామం చోటుచేసుకుంది. కాళేశ్వరం కేసు సీబీఐకి అప్పగించే విషయంలో సర్కార్ ప్రత్యేక ప్రొసీజర్‌ను ఫాలో కానుంది. కాగా, 2022లో రాష్ట్రంలోకి సీబీఐ రాకపై అప్పటి బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం నిషేధం విధించగా.. ప్రస్తుతం ఆ నిషేధాన్ని ఉపసంహరించుకునేందుకు రేవంత్ సర్కార్ పూనుకుంది. అసెంబ్లీలో కాళేశ్వరం‌పై చేసిన తీర్మానం కాపీతో పాటు విజిలెన్స్ ఎంక్వైరీ రిపోర్టు, జస్టిస్ చంద్రఘోష్ రిపోర్టులను జత చేసి సీఎస్ రామకృష్ణ రావు ఆధ్వర్యంలో నీటి పారుదల శాఖ ఉన్నతాధికారులు కాళేశ్వరంపై సీబీఐ విచారణ జరిపించాలని కేంద్ర హోంశాఖకు లేఖను రాసేందుకు సిద్ధమైనట్లుగా సమాచారం. రాష్ట్రం నుంచి లేఖ అందిన వెంటనే సీబీఐ స్పెషల్ టీమ్‌తో కాళేశ్వరం అవకతవకలపై విచారణను ప్రారంభించనున్నట్లుగా విశ్వసనీయంగా తెలుస్తోంది.

Next Story