OMC Case: ఓబుళాపురం దోషులకు బెయిల్ ఇవ్వద్దు.. హైకోర్టులో సీబీఐ కౌంటర్

by Prasad Jukanti |

ఓబుళాపురం అక్రమ మైనింగ్ కేసులో దోషులకు బెయిల్ ఇవ్వొద్దని సీబీఐ హైకోర్టును కోరింది.

OMC Case: ఓబుళాపురం దోషులకు బెయిల్ ఇవ్వద్దు.. హైకోర్టులో సీబీఐ కౌంటర్
X

దిశ, డైనమిక్ బ్యూరో: ఓబుళాపురం అక్రమ మైనింగ్ కేసులో (Obulapuram Illegal Mining Case) దోషులకు బెయిల్ ఇవ్వొద్దని సీబీఐ హైకోర్టును కోరింది. ఓఎంసీ కేసులో బెయిల్ పిటిషన్లపై ఇవాళ సీబీఐ తెలంగాణ హైకోర్టులో (High Court) కౌంటర్ దాఖలు చేసింది. గాలి జనార్ధన్ రెడ్డి, పీవీ శ్రీనివాస్ రెడ్డి, రాజగోపాల్, అలీఖాన్ లకు బెయిల్ ఇవ్వొద్దంటూ కౌంటర్ లో సీబీఐ (CBI) పేర్కొంది. కాగా ఈ కేసులో ఏడేళ్ల జైలు శిక్ష విధిస్తూ హైదరాబాద్ సీబీఐ కోర్టు ఈ నెల 6వ తేదీన తీర్పు వెలువరించింది. మొత్తం ఏడుగురికి కోర్టు శిక్ష విధించింది. ప్రస్తుతం దోషులు చంచల్ గూడ జైల్లో శిక్ష అనుభవిస్తున్నారు. ఈ క్రమంలో ప్రధాన నిందితుడు బి.విశ్రీనివాసరెడ్డి, గాలి జనార్ధన్ రెడ్డి, గనుల శాఖ మాజీ డైరెక్టర్ వి.డి. రాజగోపాల్, గాలి జనార్ధన్ రెడ్డి పీఏ మెఫజ్ అలీఖాన్ హైకోర్టును ఆశ్రయించారు. అన్ని ఆధారాలను పరిగణలోకి తీసుకోకుండా యాంత్రికంగా శిక్ష విధించిందని, అందువల్ల అప్పీలుపై విచారణ పూర్తయ్యే దాకా సీబీఐ కోర్టు తీర్పు అమలును నిలిపివేసి తమకు బెయిల్ మంజూరు చేయాలని ఈ నలుగురు హైకోర్టును కోరారు. వీరు దాఖలు చేసిన పిటిషన్లపై తాజాగా సీబీఐ కౌంటర్ దాఖలు చేసింది.

Next Story