క్యాట్ ఉత్తర్వులు అమలు.. ఎట్టకేలకు IAS శివశంకర్‌ రిలీవ్

by Kema Shiva Kumar |   (  Updated:2025-09-02 12:02:47  IST  )

ఐఏఎస్ లోతేటి శివశంకర్‌ (IAS Shiva Shankar) ఏపీ కేడర్‌కు పంపాల్సిందిగా పరిపాలనా ట్రైబ్యునల్, తెలంగాణ హైకోర్టు (Telangana High Court) ఇచ్చిన తీర్పును సవాలు చేస్తూ సుప్రీం కోర్టు (Supreme Court)కు వెళ్లాలని భావించిన డీవోపీటీ (DTPO) ఆ ప్రయత్నాన్ని విరమించుకుంది.

క్యాట్ ఉత్తర్వులు అమలు.. ఎట్టకేలకు IAS శివశంకర్‌ రిలీవ్
X

దిశ, డైనమిక్ బ్యూరో: ఐఏఎస్ లోతేటి శివశంకర్‌ (IAS Shiva Shankar) ఏపీ కేడర్‌కు పంపాల్సిందిగా పరిపాలనా ట్రైబ్యునల్, తెలంగాణ హైకోర్టు (Telangana High Court) ఇచ్చిన తీర్పును సవాలు చేస్తూ సుప్రీం కోర్టు (Supreme Court)కు వెళ్లాలని భావించిన డీవోపీటీ (DTPO) ఆ ప్రయత్నాన్ని విరమించుకుంది. హైకోర్టు ఆదేశాలు అమల్లో ఉన్న నేపథ్యంలో క్యాట్ (CAT) ఉత్తర్వుల మేరకు కేంద్ర సిబ్బంది వ్యవహారాల శాఖ (డీవోపీటీ) ఎట్టకేలకు దిగివచ్చింది. ఐఏఎస్ శివశంకర్‌ను తెలంగాణ కేడర్‌ నుంచి రిలీవ్‌ చేసి.. ఆంధ్రప్రదేశ్ కేడర్‌కు పంపేందుకు అంగీకరించింది. ఈ మేరకు ఆయనను వెంటనే రిలీవ్‌ చేయాల్సిందిగా తెలంగాణ సీఎస్‌ రామకృష్ణా రావుకు శుక్రవారం క్యాట్ నుంచి ఆదేశాలు అందాయి. దీంతో ఇవాళ ఐఏఎస్ శివశంకర్‌ను తెలంగాణ సర్కార్ రిలీవ్ చేసింది.

కాగా, 2013కు చెందిన ఐఏఎస్ అధికారి లోతేటి శివశంకర్‌ (Shiva Shankar) స్వస్థలం విజయనగరం జిల్లాలోని ధర్మవరం. అయితే, ఆయన హైదరాబాద్‌లో ఉన్న తన మామయ్య ఇంట్లో ఉండి సివిల్‌ సర్వీసెస్‌కు ప్రిపేర్ అయ్యాడు. అదేవిధంగా యూపీఎస్సీ దరఖాస్తు ఫారంలో పర్మనెంట్ అడ్రస్‌గా అదే ఇచ్చాడు. రాష్ట్ర విభజన సమయంలో కేడర్‌ నిర్ణయించేటప్పుడు చిరునామా ఆధారంగా శివశంకర్‌ను తెలంగాణకు కేటాయించారు. అయితే, ఆ నిర్ణయాన్ని ఆయన సవాలు చేస్తూ తెలంగాణ హైకోర్టును ఆశ్రయించగా ధర్మాసనం స్టే ఇచ్చింది. ఆయన ఏపీ క్యాడర్‌లో గత 11 ఏళ్లు పని చేశారని దీపక్‌ ఖండేకర్‌ (Deepak Khandekar) ఆధ్వర్యంలోని ఏకసభ్య కమిషన్‌ సిఫారసు మేరకు శివశంకర్‌ను తెలంగాణకు పంపారు. ఇదే విషయంపై శివశంకర్ క్యాట్‌ను ఆశ్రయించగా.. గతేడాది ఫిబ్రవరి 28న ఆయనకు అనుకూలంగా తీర్పు వచ్చింది. క్యాట్‌ ఉత్తర్వుల్ని సవాల్‌ చేస్తూ డీవోపీటీ తెలంగాణ హైకోర్టులో పిటిషన్‌ వేయగా.. హైకోర్టు కూడా క్యాట్‌ ఉత్తర్వులనే సమర్థిస్తూ జులై 3న తుది తీర్పును వెలువరించింది.

Next Story