కుల రాజకీయాలు కాంగ్రెస్‌కు అలవాటు.. MP ధర్మపురి అర్వింద్ సీరియస్ కామెంట్స్

by Kema Shiva Kumar |   (  Updated:2025-08-25 09:29:45  IST  )

కేంద్ర మంత్రి బండి సంజయ్ (Bandi Sanjay) బీసీ కానేకాదని.. ఓ దేశ్‌ముఖ్ అని.. కులం, మతం పేరుతో రాజకీయాలు చేయకపోతే బీజేపీ ఎన్నటికీ గెలవదని టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ (TPCC Chief Mahesh Kumar Goud) సంచలన వ్యాఖ్యలు చేశారు.

కుల రాజకీయాలు కాంగ్రెస్‌కు అలవాటు.. MP ధర్మపురి అర్వింద్ సీరియస్ కామెంట్స్
X

దిశ, వెబ్‌డెస్క్: కేంద్ర మంత్రి బండి సంజయ్ (Bandi Sanjay) బీసీ కానేకాదని.. ఓ దేశ్‌ముఖ్ అని.. కులం, మతం పేరుతో రాజకీయాలు చేయకపోతే బీజేపీ ఎన్నటికీ గెలవదని టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ (TPCC Chief Mahesh Kumar Goud) సంచలన వ్యాఖ్యలు చేశారు. దేవుడి పేరుతో తామెప్పుడు ఎన్నికలకు వెళ్లలేదని.. కానీ, కమలం పార్టీకి ఎలక్షన్ల అప్పుడే భగవంతుడు గుర్తొస్తాడని అన్నారు. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్‌కు తప్ప.. మరే పార్టీకి స్థానం లేదంటూ మహేశ్ కుమార్ గౌడ్ చేసిన వ్యాఖ్యలు హీట్‌ను పుట్టిస్తున్నారు. ఈ క్రమంలోనే కాంగ్రెస్, బీజేపీ నేతల మధ్య డైలాగ్ వార్ కొనసాగుతోంది.

తాజాగా టీపీసీసీ చీఫ్ వ్యాఖ్యలపై నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్ (MP Dharmapuri Arvind) స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కుల రాజకీయాలు చేయడం కాంగ్రెస్ పార్టీకి వెన్నతో పెట్టి విద్య అంటూ ఫైర్ అయ్యారు. దేశంలోని బీసీలకు అన్ని రకాలుగా న్యాయం చేస్తోంది ప్రధాని నరేంద్ర మోడీ (PM Narendra Modi) మాత్రమేనని అన్నారు. ‘ఓట్ చోరీ’, స్థానిక సంస్థల్లో 42 రిజర్వేషన్లు కేవలం హస్తం పార్టీ డైవర్షన్ పాలిటిక్స్ అంటూ కొట్టి పడేశారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ దిమ్మతిరిగేలా బీజేపీ సత్తా చాటడం ఖాయమని, బీజేపీకి పార్టీ కార్యకర్తలే బలమని ఎంపీ ధర్మపురి అర్వింద్ అన్నారు.

Next Story